జుట్టుకు గోరింటాకు కరెక్టుగా ఎలా అప్లై చేయాలో తెలుసా?

First Published | Jun 2, 2024, 11:57 AM IST

తెల్ల వెంట్రుకలు ఉన్నవారే కాదు మంచి కలర్ కోసం కూడా జుట్టుకు గోరింటాకును పెడుతుంటారు. నిజానికి గోరింటాకు మన జుట్టుకు ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తుంది. కానీ చాలా మంది దీన్ని సరైన పద్దతిలో అప్లై చేయరు. దీనివల్లే గోరింటాకు జుట్టుకు సరైన రంగును ఇవ్వరు. అసలు జుట్టుకు మెహందీని ఎలా అప్లై చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

నేచురల్ గా జుట్టుకు రంగు వేసుకోవడానికి మెహందీ బెస్ట్ ఆప్షన్. కానీ చాలాసార్లు జుట్టుకు గోరింటాకును అప్లై చేసిన తర్వాత కూడా ఎలాంటి తేడా కనిపించదు. అంటే మెహందీ జుట్టుకు రంగు రాదు. అలాగే చాలా సార్లు గోరింటాకు అప్లై చేసిన తర్వాత వెంట్రుకలు పగిలిపోవడంతో పాటుగా పొడిబారుతుంటాయి. జుట్టుక మెహందీ అప్లై చేసేటప్పుడు చేసిన కొన్ని పొరపాట్లే ఇందుకు కారణమంటున్నారు నిపుణులు. మరి సరైన పద్దతిలో జుట్టుకు గోరింటాకును ఎలా అప్లై చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

henna hair

వేడి నీటిని వాడండి

గోరింటాకును జుట్టుకు అప్లై చేయడానికి.. నార్మల్ వాటర్ కాకుండా వేడి నీటిని ఉపయోగించండి. ఒకటి లేదా రెండు టీస్పూన్ల టీ ఆకులను నీటిలో ఒక నిమిషం పాటు మరిగించండి. ఆ తర్వాత వాటితో గోరింటాకును మిక్సీ పట్టండి. లేదా టీ ఆకులు లేకపోతే వేడినీళ్లతో మాత్రమే గోరింటాకు మిక్సీ పట్టండి. 
 

Latest Videos


మురికి జుట్టుకు గోరింటాకు అప్లై చేయొద్దు

గోరింటాకును జుట్టుకు పెట్టుకుని ఒకేసారి తలస్నానం చేయొచ్చులే అని చాలా మంది అనుకుంటుంటారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. ఎందుకంటే జిడ్డు జుట్టు, లేదా మురికిగా ఉన్న జుట్టుకు గోరింటాకును అప్లై చేయకూడదు. దీని వల్ల గోరింటాకు ప్రభావం జుట్టుపై కనిపించదు. జుట్టు జిడ్డుగా లేకపోయినా నేచురల్ ఆయిల్ జుట్టుకు రక్షణగా పనిచేస్తుంది. దీనివల్ల గోరింటాకు రంగు జుట్టుకు బాగా చేరదు. అందుకే గోరింటాకును పెట్టడానికి ముందే జుట్టును షాంపూతో క్లీన్ చేయాలి. జుట్టు పూర్తిగా ఆరిన తర్వాత గోరింటాకును అప్లై చేయాలి.
 

ఆ తర్వాత షాంపూ

గోరింటాకును జుట్టుకు అప్లై చేసిన వెంటనే పెట్టకూడదు. దీనికి బదులుగా సాధారణ నీటితో జుట్టును బాగా కడగాలి. ఆ తర్వాత మీరు కండిషనర్ ను ఉపయోగించొచ్చు.

పెట్రోలియం జెల్లీ 

వెంట్రుకలకు మాత్రమే కాకుండా నుదిటికి, చెవులకు, మెడకు పెట్రోలియం జెల్లీ రాసుకుంటే తల లేదా చెవులపై గోరింటాకు రంగు రాకుండా ఉంటుంది.

గోరింటాకును అప్లై చేయడానికి ముందు జుట్టును బాగా దువ్వుకోవాలి. దీని వల్ల జుట్టుకు గోరింటాకు అప్లై చేయడం సులువు అవుతుంది. ఆ తర్వాత వెంట్రుకలు ఎక్కువ చిక్కులు పడకుండా ఉంటాయి. 

click me!