వాషింగ్ మెషీన్ లో వీటిని ఉతకొద్దు

Published : Jan 24, 2025, 04:52 PM IST

చాలా మంది వాషింగ్ మెషిన్ లో అన్ని రకాల దుస్తులను ఉతకొచ్చని అనుకుంటారు. అలాగే చేస్తారు కూడా. కానీ వాషింగ్ మెషిన్ లో కొన్ని రకాల దుస్తులను అస్సలు ఉతకకూడదు. అవేంటంటే?

PREV
17
వాషింగ్ మెషీన్ లో వీటిని ఉతకొద్దు


మన రోజువారి పనుల్లో ఎంతో కష్టమైన, బోరింగ్ పనుల్లో బట్టలను ఉతకడం ఒకటి. కానీ వాషింగ్ మెషిన్ల రాకతో బట్టను ఉతకడం చాలా ఈజీ అయిపోయింది. ఎన్ని బట్టలున్న ఎలాంటి టెన్షన్ లేకుండా చక్కగా వాషింగ్ మెషిన్ లో వేసి ఉతికేస్తున్నారు. చూస్తుంటేనే బట్టలు తలతలా మెరుస్తూ బయటకొచ్చేస్తాయి. వాషింగ్ మెషిన్ లో బట్టలు ఉతకడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. అలాగే సమయం కూడా ఆదా అవుతుంది. 

27
washing machine

అయితే చాలా మంది వాషింగ్ మెషిన్ వచ్చేసింది.. ఇక చేతులకు పనిచెప్పకుండా అన్నింటినీ వాషింగ్ మెషిన్ లో వాష్ చేయొచ్చని అనుకుంటుంటారు. కానీ వీటిలో ఏవి పడితే అవి వేయకూడదు. నిజానికి చాలా మందికి వాషింగ్ మెషిన్ ను ఎలా ఉపయోగించాలో తెలియదు. వాషింగ్ మెషీన్ లో ఎలాంటి బట్టలైనా ఉతుక్కోవచ్చని అనుకోవడం మంచిది కాదు. అవును వాషింగ్ మెషిన్ లో కొన్ని దుస్తులను అస్సలు ఉతకకూడదు. దీనివల్ల ఆ దుస్తులు పాడవడమే కాకుండా.. మెషిన్ కండీషన్ కూడా దెబ్బతింటుంది. 

37

వాషింగ్ మెషిన్ లో ఏయే బట్టల్ని ఉతకకూడదు

వాషింగ్ మెషిన్ లో పట్టు బట్టల్ని ఉతకకూడదు

పొరపాటున కూడా వాషింగ్ మెషిన్ లో పట్టు బట్టల్ని అస్సలు ఉతకకూడదు. ఎందుకంటే పట్టు చాలా సున్నితమైన వస్త్రం. ఇలాంటి దాన్ని వాషింగ్ మెషిన్ లో వేస్తే క్లాత్ పాడవుతుంది. హార్డ్ వాష్ వల్ల సిల్క్ దారాలు బయటకు వస్తాయి. ఆ క్లాత్ మెరుపు పూర్తిగా పోతుంది. అలాగే దీని ఎంబ్రాయిడరీ కూడా పోతుంది. ముఖ్యంగా ఖరీదైన, స్వచ్ఛమైన పట్టు పట్టు బట్టలను వాషింగ్ మెషిన్ లో వేస్తే అవి పనికిరాకుండా పోతాయి. 

47
washing machine


లెదర్ తో చేసిన వస్తువులను వాష్ చేయొద్దు 

కొంతమంది లెదర్ ప్యాంట్లు, జాకెట్లు, బూట్లు, పర్సులు, బెల్టులు, బ్యాగులు వంటి వాటిని శుభ్రం చేయడానికి వాషింగ్ మెషిన్ లో వేస్తుంటారు. కానీ వీటిని అస్సలు వేయకూడదు. దీనివల్ల లెదర్ పూర్తిగా చెడిపోవడమే కాకుండా.. వాషింగ్ మెషీన్ దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది. నిజానికి లెదర్ తో చేసిన వస్తువులు చాలా సున్నితమైనవి. అలాగే వీటిని మీరు తరచుగా శుభ్రం చేయాల్సిన అవసరం కూడా ఉండదు. వీటిని సాఫ్ట్ బ్రష్ లేదా బేబీ వైప్స్ తో క్లీన్ చేసినా శుభ్రమవుతాయి. నీట్ గా అవుతాయి. 

57
washing machine


మెషిన్ లో ఉన్ని బట్టలను ఉతకొద్దు

చలికాలంలో ఉన్ని దుస్తులను ఎక్కువగా వేసుకుంటుంటారు. అయితే ఈ ఉన్ని దుస్తులను కూడా ఎట్టిపరిస్థితిలో వాషింగ్ మెషీన్ లో ఉతకకూడదు. ముఖ్యంగా చేతితో అల్లిన స్వెట్టర్లను, జెర్సీలను అస్సలు వాషింగ్ మెషిన్ లో వేయకూడదు. దీనివల్ల అవి వదులుగా అవుతాయి. పూర్తిగా పాడవుతాయి. వాటి నేత కూడా పాడవుతుంది. అందుకే ఉన్ని బట్టలను చేతితోనే సున్నితంగా ఉతికేయాలి. 
 

67
washing machine

భారీ ఎంబ్రాయిడరీ, పూసల వస్త్రాలు

వాషింగ్ మెషీన్ లో కొంచెం డిటర్జెంట్ ను వేసి ఖరీదైన ఎంబ్రాయిడరీ, పూసలు, స్టోన్ వర్క్ బట్టలను ఎంచక్కా ఉతకొచ్చని కొందరు అనుకుంటారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. ఎందుకంటే ఇలాంటి బట్టల్ని వాషింగ్ మెషిన్ లో వేస్తే అవి త్వరగా పాడవుతాయి. మెషిన్ లో ఉతకడం వల్ల వాటి ఎంబ్రాయిడరీ, పూసలు, రాళ్ళు ఊడిపోతాయి. అలాగే వాటి రంగు, మెరుపు కూడా తగ్గుతాయి. అందుకే ఈ బట్టలను వాషింగ్ మెషిన్ లో వేయకూడదంటారు. 
 

77

బ్రాలను మెషిన్ వాష్ చేయొద్దు

ఆడవాళ్లు రోజూ వేసుకునే బ్రాను కూడా వాషింగ్ మెషిన్ లో వేయకూడదు. ఎందుకంటే బ్రాను మెషీన్ వాష్ చేసినప్పుడు హుక్ లు దెబ్బతింటుంది. అలాగే బ్రా పట్టీలు, ఆకారం వదులుగా అవుతాయి. ముఖ్యంగా ఫ్యాన్సీ లేస్ బ్రాలు, పెడ్ బ్రాలు, అండర్ వైర్ బ్రాలను మెషీన్ లో అస్సలు వాష్ చేయకూడదు. దీనివల్ల బ్రాలు పూర్తిగా పాడవుతాయి.

click me!

Recommended Stories