
చలికాలంలో చాలా మంది ఆడవారు చాలా సేపు ఎండలో కూర్చుకుంటారు. దీనివల్ల శరీరానికి హాయిగా అనిపిస్తుంది. కానీ చలిపెడుతుందని ఎండలో ఎక్కువ సేపు కూర్చుంటే మాత్రం చర్మం నల్లబడిపోతుంది. అలాగే బాగా పొడిబారుతుంది. దీనివల్ల లేనిపోని చర్మ సమస్యలు కూడా వస్తాయి. అయితే సన్ ట్యాన్ ను తొలగించడానికి ఆడవాళ్లు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా సమస్య మాత్రం తగ్గదు. కానీ కొన్ని ఇంటి చిట్కాలతో ఈ చర్మ సమస్యలను తొందరగా తగ్గించుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
కలబంద జెల్
ఎండవల్ల నల్లబడిన చర్మానికి కలబంద జెల్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అందులోనూ కలబంద చర్మ సమస్యలను తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఈ కలబంద గుజ్జులో మన చర్మానికి మేలు చేసే ఎన్నో ఔషదగుణాలుంటాయి. ముఖ్యంగా దీనిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరస్, యాంటీ సెప్టిక్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు పాలిసాకరైడ్లు, పాలీఫెనాల్స్ వంటి మూలకాలు కూడా మెండుగా ఉంటాయి. ఇవన్నీ మన చర్మాన్ని శుభ్రపరచడానికి, చర్మశుద్ధి సమస్యను తగ్గించడానికి బాగా సహాయపడతాయి.
సన్ ట్యాన్ ను పోగొట్టడానికి కలబందను ఎలా ఉపయోగించాలి?
ఇందుకోసం ఒక గిన్నె తీసుకుని అందులో కలబంద వేయండి. దీన్ని నేరుగా ఎండవల్ల నల్ల బడిన చర్మానికి, ముఖానికి అప్లై చేయండి. దీన్ని ఒక 20 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. ఆ తర్వాత ముఖాన్ని నార్మల్ వాటర్ తో కడిగేయండి. ఈ చిట్కాను మీరు ప్రతిరోజూ చేయొచ్చు.
శెనగపిండితో సన్ ట్యాన్ మాయం
శెనగపిండి కూడా మన చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని ముఖానికి ఉపయోగించడం వల్ల ముఖం మెరిసిపోతుంది. శెనగపిండిని వాడితే డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి. దీనితో ఎండకు నల్లబడిన చర్మం శుభ్రపడుతుంది. అలాగే చర్మం మృదువుగా అవుతుంది. అందంగా మెరిసిపోతుందని నిపుణులు చెబుతున్నారు.
ముఖానికి శెనగపిండిని ఎలా ఉపయోగించాలి?
ఇందుకోసం ఒక గిన్నెలో శనగపిండిని తీసుకుని అందులో కొంచెం పెరుగును వేసి బాగా కలపండి. ఈ పేస్ట్ ను బాగా కలిపి ముఖానికి పెట్టండి. ఇది పూర్తిగా ఆరిన తర్వాత చేతులతో నెమ్మదిగా మసాజ్ చేస్తూ ఈ పేస్ట్ ను శుభ్రం చేయండి. అయితే ఇంటి చిట్కాలను పాటించే ముందు ఖచ్చితంగా ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి.