భారతదేశంలో అత్యంత సంపన్నుడైన వ్యాపారవేత్త ముకేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. అనంత్- రాధికల వివాహం కళ్లారా చూడటానికి, నూతన వధూవరులను ఆశీర్వదించడానికి దేశంలోని చాలా మంది సెలబ్రెటీలు వెళ్లారు. టాలీవుడ్, బాలీవుడ్, రాజకీయ, వ్యాపార, క్రికెట్ ప్రముఖులంతా వెళ్లి సందడి చేశారు.