హెన్నా, ఉసిరిని ఇలా పెడితే తెల్ల జుట్టు నల్లగా అవుతుంది

First Published | Dec 23, 2024, 11:05 AM IST

ఈ రోజుల్లో చాలా మందికి చిన్న వయసులోనే జుట్టు తెల్లగా అవుతోంది. ఇక ఈ తెల్ల జుట్టును నల్లగా చేసేందుకు నల్లని రంగులను వేస్తుంటారు. కానీ రంగు వేయకుండానే తెల్ల జుట్టును నల్లగా చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

ఒకప్పుడు పెద్ద వయసు వారికి మాత్రమే తెల్ల వెంట్రుకలు వచ్చేవి. వీటిని చూసే వయసు మీదపడుతుందని అర్థం చేసుకునే వారు. కానీ ఈ రోజులు 20, 30 ఏండ్ల వారికి కూడా తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి. దీనికి కారణాలు ఉన్నో ఉన్నాయి. ముఖ్యంగా మన ఆహారపు అలవాట్లు, మారుతున్న వాతావరణం, చెడు జీవనశైలి వల్ల కూడా తెల్ల వెంట్రుకలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 


నిజానికి ఈ రోజుల్లో తెల్ల జుట్టు ఒక సర్వ సాధారణ సమస్యగా మారింది. ఈ సమస్య అన్ని వయసుల వారికీ వస్తోంది. అందుకే ఈ తెల్ల వెంట్రుకలను దాచేయడానికి చాలా మంది నెత్తికి రంగులను వేస్తుంటారు. కానీ ఈ రంగు వారం కంటే ఎక్కువ రోజులు ఉండదు. కానీ కెమికల్స్ రంగులను ఉపయోగించడం వల్ల జుట్టు దెబ్బతింటుంది. బాగా రాలుతుంది. పొడిబారుతుంది. 

మార్కెట్ లో దొరికే కెమికల్స్ ఎక్కువగా ఉండే రంగులను ఉపయోగించడం వల్ల కళ్లపై చెడు ప్రభావం పడుతుంది. అలాగే నుదురు పై వాపు, దురద, వెంట్రుకలు పొడిబారడం వంటి సమస్యలొచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. అందుకే కెమికల్ రంగులను ఉపయోగించకుండా తెల్ల జుట్టును నల్లగా చేయడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 


చిన్న వయసులో జుట్టు తెల్లబడటానికి కారణాలు

పెద్ద వయసులోనూ మన జుట్టును నల్లగా ఉంచడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం. కానీ నూనె పెట్టడం నుంచి సరైన ఆహారాన్ని తినకపోవడం వరకు కొన్ని పొరపాట్ల వల్ల నల్ల జుట్టు తెల్లగా అవుతుంది. ముఖ్యంగా విటమిన్లు, ఖనిజాల లోపం మెలనిన్ ఉత్పత్తి తగ్గుతుంది. దీనివల్ల జుట్టు తెల్లగా అవుతుంది. అలాగే  శరీరంలో ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్ లోపాలు ఉన్నా జుట్టు తెల్లగా అవుతుంది. అందుకే సహజంగా జుట్టును నల్లగా చేయడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

నేచురల్ రంగును తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు 

ఒక కప్పు నీళ్లు, 2 టీ స్పూన్ల కాఫీ పౌడర్, 4టీస్పూన్ల మెహందీ పౌడర్, ఒక టీ స్పూన్ ఉసిరి పొడి, నిమ్మకాయ - 1/2. 

తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి నేచురల్ రంగును ఎలా తయారుచేయాలి?  

ఇందుకోసం ముందుగా ఒక గిన్నెతీసుకుని అందులో ఒక గ్లాసు నీళ్లు పోసి వేడెక్కించండి. ఆ తర్వత అందులో 2 టీస్పూన్ల కాఫీ పౌడర్ ను వేసి మరిగించండి. దీంట్లో గోరింటాకు పొడిని వేసి ఉడికించండి.ఇప్పుడు  దీనిలో ఉసిరిపొడిని వేసి నిమ్మకాయ రసం  పిండండి. వీటన్నింటినీ బాగా కలిపి దించండి. ఇవన్నీ బాగా ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేయండి. దీన్ని నాలుగు గంటల పాటు చల్లారనివ్వండి. 

ఆ తర్వాత ఈ రంగును ఒక గిన్నెలోకి తీసుకుని బ్రష్ తో తెల్ల జుట్టుకు పెట్టండి.  దీన్ని 1 నుంచి 2 గంటలు అలాగే ఉంచండి.  ఆతర్వాత నార్మల్ వాటర్ తో కడిగేయండి. దీనికి అన్నీ సహజ పదార్థాలనే ఉపయోగించడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. కానీ మీకు వీటిలో ఏదైనా పదార్థానికి అలెర్జీ ఉంటే మాత్రం దీన్ని పెట్టకపోవడమే మంచిది. 
 

ఉసిరికాయను జుట్టుకు అప్లై చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు

ఉసిరి మన ఆరోగ్యానికి మాత్రమే కాదు.. మన జుట్టుకు కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. చాలా మంది దీన్ని హెర్బ్ గా కూడా ఉపయోగిస్తారు. ఉసిరికాయను తిన్నా, జుట్టుకు అప్లై చేసినా దీనిలో పుష్కలంగా ఉండే విటమిన్ సి జుట్టు తెల్లబడటాన్ని తగ్గిస్తుంది.  అలాగే దీనిలో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు స్కాల్ప్ అలర్జీలు రాకుండా చూస్తాయి. అలాగే ఇది చలికాలంలో చుండ్రు రాకుండా కాపాడుతుంది. 

జుట్టుకు కాఫీ వల్ల కలిగే ప్రయోజనాలు

చాలా మంది ఆడవారు జుట్టు హెన్నాను ఉపయోగించినప్పుడల్లా నార్మల్ వాటర్ కు బదులుగా కాఫీ లేదా టీ వాటర్ ను ఉపయోగిస్తుంటారు. ఎందుకంటే కాఫీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి మన జుట్టును కాపాడుతాయి. అలాగే జుట్టు పొడుగ్గా పెరగడానికి సహాయపడతాయి. 

Latest Videos

click me!