ఒకరిలా ఇంకొకరి ముఖం ఉండదన్నట్టు.. దంతాలు కూడా ఒకరికి ఉన్నట్టు ఉండవు. ఒక్కొక్కరికీ ఒక్కోలా దంతాల ఆకారం ఉంటుంది. కానీ మనకున్న దంతాలే మన చిరునవ్వును మరింత అందంగా మార్చేస్తాయి.
foods for teeth
అయితే కొంతమందికి దంతాల మధ్య గ్యాప్ ఉంటుంది. దీన్ని వీళ్లు నామోషీగా ఫీలవుతుంటారు. అందుకే నలుగురిలో నవ్వడానికి గానీ, మాట్లాడటానికి కానీ సిగ్గు పడుతుంటారు. ఒకవేళ నవ్వినా చేయి అడ్డం పెట్టుకుంటుంటారు. జ్యోతిష్యం ప్రకారం.. పళ్ల మధ్య గ్యాప్ ఉండటం చాలా మంచిది. అసలు దంతాల మధ్య గ్యాప్ ఉన్నవారు ఎలాంటి వారు? వారి భవిష్యత్తు ఎలా ఉండబోతోందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
దంతాల ఆకృతి: సముద్ర శాస్త్రం ప్రకారం.. పళ్ల మధ్య సందులు ఉన్నవారు చాలా తెలివైన వారట. వీరిని తక్కువ అంచనా వేయడానికి లేదు. వీరికి ఇతరుల కంటే ఎంతో పరిజ్ఞానం ఉంటుందని సముద్ర శాస్త్రం చెబుతోంది.
జీవితంలో విజయం: పళ్ల మధ్య గ్యాప్ ఉన్నవారు నలుగురిలో నవ్వడానికి సిగ్గు పడొచ్చు. కానీ వీళ్లు జీవితంలో అనుకున్న విజయాన్ని సాధిస్తారని సముద్ర శాస్త్రం చెబుతోంది. వీళ్లు మొదలు పెట్టిన ప్రతి పనిలో ఎలాంటి అడ్డంకులు లేకుండా ముందుకు వెళతారు. ప్రతి రంగంలో విజయాన్ని సాధించి తీరుతారు.
అదృష్టం: ప్రతి ఒక్కరూ అదృష్టం కలగాలని కోరుకుంటారు. ఎందుకంటే అదృష్టం ఉంటే అనుకున్నది ప్రతి ఒక్కటీ నెరవేరుతుంది. కానీ సముద్ర శాస్త్రం ప్రకారం.. పళ్ల మధ్య సందులు ఉన్నవారు చాలా చాలా అదృష్టవంతుడని నమ్ముతారు. వీళ్లు జీవితంలో సానుకూలత ఎక్కువగా ఉంటుంది.
ఇతరులకు సహాయం చేయడం: దంతాల మధ్య గ్యాప్ ఉన్నవారు ఎంతో సాదాసీదా జీవితం గడపడానికి ఇష్టపడతారు. కానీ వీళ్లు ఇతరులకు సాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం వీరికి గొప్ప ఆనందాన్ని కలిగిస్తుంది.
కెరీర్ సక్సెస్: పళ్ల మధ్య గ్యాప్ ఉన్నవారు చాలా కష్టపడి పనిచేస్తారు. వీళ్లు తమ పట్టుదల, కృషితో కెరీర్ లో ఎన్నో గొప్ప గొప్ప విజయాలను అందుకుంటారు. అలాగే ప్రతి పనిని వీరు కష్టంతో కాకుండా ఎంతో ఇష్టంతో పూర్తి చేస్తారు. అందుకే పనుల్లో వీరు ఆనందాన్ని అందుకుంటారు.
ఓపెన్ మైండెడ్: దంతాల మధ్య గ్యాప్ ఉన్నవారు చాలా ఓపెన్ మైండెడ్ అని సముద్రశాస్త్రం చెబుతోంది. వీళ్లు ఏ విషయమైనా ముఖం మీదే చెప్పేస్తారు. గుసగుసలు చెప్పుకునే వ్యక్తులు వీళ్లు కారు. వీరు ఎవ్వరిపైనా పగలు ప్రతీకారాలు అసలే పెంచుకోరు.