మిస్ ఇండియా టైటిల్ గెలిచిన తెలుగమ్మాయి..!

First Published | Feb 11, 2021, 2:00 PM IST

ఈ పోటీలకు నటులు నేహా ధూపియా, చిత్రాంగద సింగ్, పుల్కిత్ సామ్రట్, ప్రముఖ డిజైనర్లు ఫాల్గుని, షేన్ పికాక్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. 

‘మిస్ ఇండియా 2020’ టైటిల్‌ తెలుగమ్మాయిని వరించింది. బుధవారం అంగరంగ వైభవంగా జరిగిన వీఎల్‌సీసీ ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2020 పోటీలో హైదరాబాద్‌కు చెందిన మానస వారణాసి విజేతగా నిలిచింది.
undefined
2021లో జరగబోయే 70వ మిస్ వరల్డ్ పోటీల్లో భారత్ తరపున మానస పాల్గొననుంది. ఇక వీఎల్‌సీసీ ఫెమినా మిస్ ఇండియా 2020 రన్నరప్‌గా ఉత్తరప్రదేశ్‌కు చెందిన మాన్యా సింగ్, మిస్ గ్రాండ్ ఇండియా 2020గా హర్యానాకు చెందిన మానికా షియోఖండ్ నిలిచారు.
undefined

Latest Videos


మిస్ ఇండియా 2019 సుమన్ రావు మానసకు కిరీటాన్ని బహూకరించారు.
undefined
ఈ పోటీలకు నటులు నేహా ధూపియా, చిత్రాంగద సింగ్, పుల్కిత్ సామ్రట్, ప్రముఖ డిజైనర్లు ఫాల్గుని, షేన్ పికాక్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. మొదటి రౌండ్‌కు మిస్ వరల్డ్ ఏషియా 2019 సుమన్ రావు నాయకత్వం వహించారు.
undefined
ఈ పోటీకి సంబంధించిన గ్రాండ్ ఫినాలే ఈ నెల 28న కలర్స్ టీవీ చాన‌ల్‌లో ప్రసారం కానుంది. కాగా.. ఇంజినీరింగ్‌ను పూర్తి చేసిన మానస ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్‌ఛేంజ్ అనలిస్ట్‌గా పనిచేస్తోంది.
undefined
హరియాణా యువతి మానిక శికంద్‌ ఫెమినా మిస్‌ గ్రాండ్‌ ఇండియా 2020గా, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన మాన్యసింగ్‌ ఫెమినా మిస్‌ ఇండియా 2020 రన్నరప్‌గా నిలిచారు. జ్యూరీ సభ్యులుగా బాలీవుడ్‌ నటులు నేహా ధూపియా, చిత్రాంగద సింగ్‌, పులకిత్‌ సమ్రాట్‌, ప్రముఖ డిజైనర్‌ ఫల్గుణి వ్యవహరించారు.
undefined
ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2020 పోటీల్లో విజేతగా నిలిచిన మానస వారణాసి వయసు 23 సంవత్సరాలు. పుట్టింది హైదరాబాద్‏లోనే. మానస గ్లోబల్ ఇండియన్ స్కూల్లో తన విద్యాభ్యాసం పూర్తి చేసింది.
undefined
వాసవి ఇంజినీరింగ్ కాలేజీలో ఇంజినీర్ పూర్తిచేసింది. ఇంజినీరింగ్ పూర్తిచేసిన మానస ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్‏ఛేంజ్ అనలిస్ట్‏గా పనిచేస్తోంది.
undefined
click me!