బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ అందమే అందం. పెళ్లికి ముందు ఎంత అందంగా మెరిసిపోయిందో.. పెళ్లి తర్వాత.. ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా ఆమె అంతే అందంగా మెరిసిపోతోంది. మరి ఆమె అందం వెనక సీక్రెట్ ఏంటో మనమూ తెలుసుకుందామా..
undefined
బాలీవుడ్ బ్యూటీ అనుష్క... సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటారు. తన లైఫ్ కి సంబంధించిన అన్ని ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు షేర్ చేస్తూనే ఉంటారు. తాజాగా.... ఆమె చర్మం వెనక రహస్యాన్ని తెలియజేశారు.
undefined
అనుష్క ఉదయం లేవగానే.. తన రోజుకి వ్యాయామంతోనే మొదలుపెడతారట. అలా చేయడం వల్ల శరీరంలో ఉన్న టాక్సిన్స్ అన్నీ బయటకు వెళ్లిపోతాయి. దాని వల్ల ఆరోగ్యంగానూ.. అందంగానే కనపడతామట.
undefined
అనుష్క.. ఫేసియల్ మసాజ్ లు ఎక్కువగా చేస్తుంటారట. మేకప్ వేసుకున్నా.. వేసుకోకున్నా.. అందంగా కనిపించాలంటే.. ముఖానికి కూడా వ్యాయామం అవసరమట. అందుకే తాను ఫేషియల్ మసాజ్ ఎక్కువగా ఇష్టపడతానని చెబుతోంది. దాని వల్ల చర్మం ఎప్పుడూ మెరుస్తూ ఉంటుంది.
undefined
ఆయిల్ పుల్లింగ్... ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ఆయిల్ పుల్లింగ్ కూడా చేస్తారట. దాని వల్ల కూడా చర్మం అందంగా మెరుస్తూ ఉంటుందని ఆమె చెప్పారు.
undefined
ఎల్డర్ ఫ్లవర్ డ్రింక్.. తన అందమైన చర్మానికి.. ఆరోగ్యానికి ఎల్డర్ ఫ్లవర్ డ్రింక్ తాగుతారట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. ఇది రోగ నిరోధక శక్తిని కూడా పెంచుుతంది.
undefined
ముఖం అందంగా కనిపించాలంటే.. కనుబొమ్మలు కీలక పాత్ర పోషిస్తాయి. తన కనుబొమ్మలు బోల్డ్ గా ఉండేలా.. కను రెప్పలు వంకర తిరిగేలా ఉండేలా జాగ్రత్తపడతానని ఆమె చెప్పారు.
undefined
మీ హెయిర్ కట్ ఎంత పర్ఫెక్ట్ గా ఉంటే.. మీ ముఖం కూడా అందంగా ఉంటుంది. అందుకే.. తాను లాబ్ కట్ చేయించుకుంటానని చెప్పారు.
undefined
గాలా ఈవెంట్స్ కి తాను ఎక్కువగా క్లాసిక్ మేకోవర్ చేయించుకుంటానని ఆమె చెప్పారు. ఆమె తన పెళ్లికి కూడా అదేవిధంగా ముస్తాబవ్వడం విశేషం.
undefined