మస్టర్డ్ ఆయిల్ జుట్టుకు సహజమైన కండీషనర్‌గా పనిచేస్తుంది. ఇది జుట్టుకు పోషణను అందించడంలో , చిట్లడం తగ్గించడంలో సహాయపడుతుంది.
ఇది కొత్త జుట్టు పెరగడానికి , సరైన పోషకాహారాన్ని అందించడంలో సహాయపడుతుంది.
ఇక ఉల్లి విషయానికి వస్తే....ఉల్లిపాయ రసంలో సల్ఫర్ పుష్కలంగా ఉంటుంది, ఇది జుట్టును మెరిసేలా , ఒత్తుగా మార్చడంలో సహాయపడుతుంది.
ఇందులో సల్ఫర్ ఉండటం వల్ల జుట్టు పల్చబడడాన్ని నివారిస్తుంది. ఉల్లిపాయలో ఉండే యాంటీఆక్సిడెంట్ మూలకం జుట్టుకు తేమను అందించడంలో సహాయపడుతుంది.