జుట్టు కత్తిరిస్తే.... ఎక్కువ పెరుగుతుందా..? నిజమెంత..?

First Published | Jun 28, 2024, 10:14 AM IST

ప్రతి ఒక్కరికీ సంవత్సరానికి ఆరు ఇంచుల వరకు పెరుగుతుందట. మన వయసు, ఆరోగ్యం, మనం తీసుకున్న డైట్ ని బట్టి.. జుట్టు పెరుగుదల ఆధారపడి ఉంటుంది.

జుట్టు ఒత్తుగా పెరగాలి అని.. బాగుండాలి అని అందరూ కోరుకుంటారు. దాని కోసం హెయిర్ కేర్ ని ఫాలో అవుతూ ఉంటారు. అయితే... ఈ రోజుల్లో చాలా మంది.. పలు రకాల హెయిర్ స్టైయిలింగ్స్ ఫాలో అవుతూ ఉంటారు. ఆ హెయిర్ స్టైల్స్ కోసం హీట్ ప్రొడక్ట్స్.. ఏవేవో క్రీములు, షాంపూలు వాడుతూ ఉంటారు. వాటి కారణంగా.. జుట్టు తొందరగా పాడౌతుంది.  ముఖ్యంగా.. జుట్టు చివరలు ఎక్కువగా చిట్లు పడుతూ ఉంటాయి. అలాంటప్పుడు చాలా మంది.. జుట్టు చివరలు కత్తిరించినా.. జుట్టు నార్మల్ గా కట్ చేయించుకున్నా... మళ్లీ ఎక్కువగా పెరుగుతుంది అని నమ్ముతుంటారు. కానీ.. అందులో నిజం ఎంత..? జుట్టు కత్తిరిస్తే.. నిజంగా మళ్లీ పెరుగుతుందా..? దీని గురించి నిపుణులు ఏమంటున్నారో చూద్దాం..

అందరూ జుట్టు పొడవు.. చివర కొసల నుంచి మొదలౌతుందని అనుకుంటారు. కానీ... జుట్టు పెరుగుదల అనేది... స్కాల్ప్ మొదలు నుంచి మొదలౌతుంది. మంచి ప్రోటీన్  తీసుకున్నప్పుడు దీని గ్రోత్ ఎక్కువగా ఉంటుంది.  నిజానికి మనం ఎలాంటి కేర్ తీసుకున్నా తీసుకోకపోయినా.. ప్రతి ఒక్కరికీ సంవత్సరానికి ఆరు ఇంచుల వరకు పెరుగుతుందట. మన వయసు, ఆరోగ్యం, మనం తీసుకున్న డైట్ ని బట్టి.. జుట్టు పెరుగుదల ఆధారపడి ఉంటుంది.


ఈ లెక్కన విషయం ఏమిటంటే.. . మనం జుట్టు కత్తిరించినా,  కత్తిరించకున్నా జట్టు పెరుగుదలపై ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. ఎందుకంటే మనం జుట్టు చివరలు కత్తిరిస్తాం.. దానికీ.... కుదుళ్ల వద్ద పెరుగుదలకు ఎలాంటి సంబంధం లేదు. దీని ప్రకారం.. మనం జుట్టు కత్తిరిస్తే.. పెరుగుతుంది అనే దాంట్లో ఎలాంటి నిజం లేదు.
 

కానీ.. అప్పుడప్పుడు జుట్టు కత్తిరించడం వల్ల.. ప్రయోజనాలు మాత్రం ఉన్నాయట. జుట్టు కత్తిరించడం వల్ల.. జుట్టు వేగంగా పెరగకపోవచ్చు. కానీ...జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి మాత్రం సహాయపడుతుంది.జుట్టు స్పిల్ట్స్  లేకుండా చూడటానికి అందంగా కనపడటానికి సహాయపడతాయి. జుట్టు చివరలు కత్తిరించడం వల్ల.. జుట్టుు పొడవు తగ్గినా.. ఒత్తు గా కనపడుతుంది. 

తరచూ జుట్టు కత్తిరించడం వల్ల.. జుట్టు.. తొందరంగా విరిగిపోకుండా.. మంచి షేపులో.. అందంగా కనపడుతుంది.  అంతే తప్ప.. జుట్టు కత్తిరించడం వల్ల జుట్టు మాత్రం పెరగదు. ఉన్నంతలో మనకు మంచిగా కనపడుతుంది అంతే. 

Latest Videos

click me!