చలికాలంలో పెదాల పగగుళ్లకు ఇలా చెక్ పెట్టండి..!

First Published | Nov 8, 2024, 12:56 PM IST

పగిలిపోకుండా పెదాలను కాపాడుకునేదెలా? సింపుల్ గా ఇంట్లోనే కొన్ని రెమిడీలు ఫాలో అయితే పెదాలు ఎలాంటి పగళ్లు లేకుండా మృదువుగా మారతాయి. మరి, అదెలాగో ఇప్పుడు చూద్దాం..

చలికాలం వచ్చిందంటే చాలు చలి చంపేస్తుంది. ఈ సీజన్ లో స్కిన్ డ్యామేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. స్కిన్ కి రెగ్యులర్ గా మాయిశ్చరైజర్ రాసుకుంటే తప్ప స్కిన్ నార్మల్ గా ఉండదు. అయితే.. స్కిన్ తో పాటు.. పెదాలు కూాడా చాలా ఎక్కువగా డ్యామేజ్ అవుతూ ఉంటాయి. మరి.. పగిలిపోకుండా పెదాలను కాపాడుకునేదెలా? సింపుల్ గా ఇంట్లోనే కొన్ని రెమిడీలు ఫాలో అయితే పెదాలు ఎలాంటి పగళ్లు లేకుండా మృదువుగా మారతాయి. మరి, అదెలాగో ఇప్పుడు చూద్దాం..

చలికాలంలో ఆ వాతావరణానికి పెదాలు తొందరగా పగలడం  ప్రారంభిస్తాయి. అటువంటి పరిస్థితిలో, వాటిని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. దీని కోసం, ఖరీదైన ఉత్పత్తులకు బదులుగా, ఇంటి నివారణలు మరింత ప్రభావవంతంగా పనిచేస్తాయి.

కాబట్టి పగిలిన పెదాలను మృదువుగా చేయడానికి ,పగిలిపోకుండా ఉండేందుకు ఏం చేయాలో చూద్దాం..

Latest Videos


మనం పెదాలకు గులాబీ రేకులు, పచ్చిపాలు, రోజ్ వాటర్, తేనె మాత్రమే వాడాలి. ఇవే ఎందుకు వాడాలి అంటే…  ఇవి మాత్రమే మన పెదాలను హైడ్రేటెడ్ గా ఉంచడంలో సహాయపడతాయి. అంతేకాదు.. ఇవి మన పెదాలపై పేర్కొన్న నలుపును తగ్గించడంలో సహాయం చేస్తాయి. మరి, వీటిని ఎలా పెదాలకు అప్లై చేయాలో చూద్దాం

ముందుగా ఒక గిన్నెలో పచ్చి పాలను వేయాలి.

దీనికి కొద్దిగా రోజ్ వాటర్ ,అర టీస్పూన్ తేనె కలపండి.

వీటన్నింటిని బాగా మిక్స్ చేసి పెదాలపై అప్లై చేయండి.

15 నిముషాలు అలాగే ఉంచిన తర్వాత కాటన్ సహాయంతో తీసేయాలి.

మీరు దీన్ని రాత్రిపూట ఉపయోగించవచ్చు.

దీన్ని రోజూ పెదాలపై రాసుకుంటే పొడిబారడం తగ్గుతుంది.

click me!