పీరియడ్స్ లో ఈ ఆహారాలు దూరంగా ఉండాల్సిందే..!

Published : Jul 21, 2022, 12:22 PM IST

ఆ నొప్పిని తట్టుకోవాలన్నా.. అసలు నొప్పి అనేది రాకుండా.. మనం పీరియడ్స్ లో మరింత ఇబ్బంది పడకుండా ఉండాలంటే.. మనం కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండాలట. 

PREV
19
 పీరియడ్స్ లో ఈ ఆహారాలు దూరంగా ఉండాల్సిందే..!

మహిళలకు పీరియడ్స్ ప్రతి నెల నెలా వస్తూనే ఉంటాయి. దీనిని మన ఆపలేం. ఈ పీరియడ్స్ తో పాటు.. మనకు నొప్పి రావడం కూడా అంతే సహజం. అయితే... ఆ నొప్పిని తట్టుకోవాలన్నా.. అసలు నొప్పి అనేది రాకుండా.. మనం పీరియడ్స్ లో మరింత ఇబ్బంది పడకుండా ఉండాలంటే.. మనం కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండాలట. మరి ఆ ఆహారాలేంటో ఓసారి చూద్దాం..

29

1.షుగర్ ఫుడ్స్..

పీరియడ్స్  సమయంలో పంచదార ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోకూడదట. తీసుకోవడం వల్ల  మన రక్తంలోని నార్మల్ బ్లడ్ షుగర్ లెవల్స్ డిస్టర్బ్ అవుతూ ఉంటాయట. దీని వల్ల పీరియడ్స్ పెయిన్ మరింత ఎక్కువగా అవుతుందట. మూడ్ స్వింగ్స్ మారిపోతాయట. మనకు తెలియకుండానే ఒత్తిడి పెరుగుతుందట.

39

2.రిఫైండ్ ఫుడ్స్..

పీరియడ్స్ సమయంలో రిఫైండ్ ఫుడ్స్ తీసుకోకూడదు. అంటే.. వైట్ బ్రెడ్, సెరెల్, రైస్ లాంటివి తీసుకోకూడదు. వీటికి బదులు..Whole grains, బ్రౌన్ ఫుడ్స్ లాంటివి తీసుకోవడం ఉత్తమం.

49

3.డీప్ ఫ్రైడ్ ఫుడ్స్...
 నూనెలో వేయించిన ఆహారాలను పీరియడ్స్ సమయంలో తీసుకోకూడదట. సమోసాలు, ఫ్రెంచ్ ఫ్రైస్, పరాటాలు, ఇతర నూనెలో వేయించిన ఆహారాలకు దూరంగా ఉండాలి. ఇవి ఆరోగ్యానికి మంచిది కాదు. పీరియడ్స్ లో నొప్పి మరింత  పెరిగే అవకాశం ఉంది.
 

59

4.శాచురేటెడ్ ఫుడ్స్..
శాచురేటెడ్ ఫుడ్స్ ని పీరియడ్స్ సమయంలో తీసుకోవడం వల్ల కడుపులో మంట లాంటివి కలిగే అవకాశం ఉంది. కాబట్టి.. ఫ్యాటీ మీట్స్, కొబ్బరి నూనె, డెయిరీ ఆహారాలకు దూరంగా ఉండాలి.

69

5.కూల్ డ్రింక్స్..

ఇక పీరియడ్స్ సమయంలో.. కూల్ డ్రింక్స్ కి దూరంగా ఉండాలి. ఇవి తీసుకోవడం వల్ల కూడా.. పీరియడ్స్ లో నొప్పి మరింతగా పెరిగే అవకాశం ఉంది. దీనితో.. బ్లోటింగ్ వంటి సమస్యలు కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి.. వీటికి దూరంగా ఉండాలి.
 

79

 

6.ప్రాసెస్డ్ ఆహారం..

పీరియడ్స్ సమయంలో ప్రాసెస్డ్ ఆహారాలకు దూరంగా ఉండాలి. అంటే ముఖ్యంగా కేకులు, చిప్స్, కుకీస్ లాంటి వాటిని తినకుండా ఉండటమే మంచిది. పీరియడ్స్ సమయంలో వీటిని తినడం వల్ల.. కడుపులో మంట, అసౌకర్యంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి.. పీరియడ్స్ లో వీటి జోలికి వెళ్లకపోవడమే మంచిది.

 

89

7.కాఫీ...

చాలా మంది పీరియడ్స్ లో పెయిన్ నుంచి రిలీఫ్ పొందడానికీ పదే పదే కాఫీలు తాగుతూ ఉంటారు. కానీ.. పీరియడ్స్ సమయంలో.. కాఫీ అస్సలు తాగకూడదట. దీని వల్ల.. శరీరంలో ఈస్ట్రోజన్  వంటి హార్మోన్లు అధిక మొత్తంలో విడుదలై ఇబ్బంది పెడతాయట. కాబట్టి.. కాఫీకి దూరంగా ఉండాలట.

99

8.సోడియం..

సోడియం ఎక్కువగా ఉండే ఆహారాలకు పీరియడ్స్ సమయంలో చాలా దూరంగా ఉండాలట. ముఖ్యంగా ఉప్పు ఎక్కువగా తీసుకోకూడదు. ఇవి కూడా పీరియడ్స్ క్రాంప్స్ ని పెంచేస్తాయట. కాబట్టి.. ఉప్పు తక్కువగా ఉండే ఆహారాలను మాత్రమే తీసుకోవాలి.

Read more Photos on
click me!

Recommended Stories