ఈ నూనెను ఎలా తయారు చేయాలి?
ముందుగా, ఒక పాన్ తీసుకుని, దానికి కొబ్బరి నూనె వేసి తక్కువ వేడి మీద మరిగించాలి. నూనె వేడి అయిన తర్వాత , కరివేపాకు, మెంతులు, కలోంజి గింజలు అన్నింటినీ సమాన పరిమాణంలో వేయాలి. ఇప్పుడు దానిని 10 నుండి 15 నిమిషాలు తక్కువ మంట మీద మరిగించాలి.ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. నూనె కాస్త చల్లగా మారిన తర్వాత అందులో మందారపూలను వేయాలి. ఆ తర్వాత నూనెను రాత్రంతా అలానే వదిలేయాలి. మరుసటి రోజున నూనెను వడకట్టుకోవాలి. అంతే... ఒక గాజు కంటైనర్ లో స్టోర్ చేయాలి. ఇప్పుడు ఈ నూనెను ప్రతిరోజూ మీ జుట్టుకు రాస్తూ ఉండాలి.