ఒకటి రెండు రోజులే పీరియడ్స్ బ్లీడింగ్ ఎందుకు అవుతుందో తెలుసా?

First Published | Jun 25, 2024, 4:01 PM IST

సాధారణంగా పీరియడ్స్ సమయంలో రక్తస్రావం 3 నుంచి 5 రోజులు అవుతుంది. ఇది కామన్. కానీ కొంతమంది ఆడవారికి కేవలం 1 లేదా 2 రోజులు మాత్రమే పీరియడ్స్ వస్తాయి. ఇలా అయితే ఏమౌతుందో తెలుసా? 
 

పీరియడ్స్ ప్రతి ఒక్క మహిళకు భిన్నంగా ఉంటుంది. పీరియడ్స్ సాధారణంగా 3 నుంచి 7 వరకు వస్తాయి. కానీ కొన్నిసార్లు కొంతమంది ఆడవారికి ఇలా జరగదు. కొంతమందికి 3 రోజుల కన్నా తక్కువ లేదా 7 రోజుల కంటే ఎక్కువ రోజులు పీరియడ్స్ బ్లీడింగ్ అవుతుంటుంది. ఇక కొంతమందికి అయితే పీరియడ్స్ లో ఒక రోజు మాత్రమే బ్లీడింగ్ అవుతుంటుంది. అసలు ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా? 

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. 1 రోజు మాత్రమే పీరియడ్ బ్లీడింగ్ సాధారణమేనా అని తెలుసుకోవడానికి మీ ఫస్ట్ రుతుచక్రాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. పీరియడ్స్ మధ్య సాధారణంగా 28 రోజుల గ్యాప్ ఉంటుంది.  అంటే 28 రోజుల చక్రం అన్న మాట. కానీ ఇది 21 నుంచి 35 రోజుల మధ్య కూడా ఉండే అవకాశం ఉంది. ఈ చక్రం ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్ల ద్వారా నియంత్రించబడుతుంది. ఈ హార్మోన్లు ఆడవారి శరీరాన్ని గర్భధారణకు సిద్ధం చేస్తాయి. ప్రెగ్నెన్సీ లేకపోతే పీరియడ్స్ ఖచ్చితంగా అవుతాయి. 


ఒక రోజు మాత్రమే పీరియడ్స్ రావడానికి కారణాలు

శరీరంలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్లు లోపించడం వల్ల కూడా ఒకరోజు మాత్రమే పీరియడ్స్ బ్లీడింగ్ అవుతుంది. ఇలా ఎక్కువ సార్లు కౌమారదశలో లేదా పెరిమెనోపాజ్ లో జరుగుతుంది. అలాగే స్ట్రెస్ లెవెల్స్ పరిగినా రుతుచక్రం దెబ్బతిని పీరియడ్స్ తక్కువ రోజులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
 


మీ శరీర బరువులో మార్పు అంటే బరువు తగ్గినా, బరువు పెరిగినా కూడా మీ పీరియడ్స్ టైం మారుతుంది. హార్మోన్ల గర్భనిరోధకాలు లేదా జనన నియంత్రణ మాత్రలు కూడా పీరియడ్స్ బ్లీడింగ్ పై ప్రభావాన్ని చూపుతాయి. దీనివల్ల రక్త ప్రవాహం తగ్గుతుంది. అలాగే పీరియడ్స్ ఒక రోజు మాత్రమే కావొచ్చు. లేదా కొన్నిసార్లు మొత్తమే కాకపోవచ్చు. 
 

థైరాయిడ్ లేదా పీసీఓడీ వంటి ఎన్నో అనారోగ్య సమస్యల వల్ల కూడా పీరియడ్స్ తక్కువ రోజులు అవుతాయి. స్వల్ప లేదా తేలికపాటి కాలాలు కూడా కొన్నిసార్లు గర్భధారణకు సంకేతం కావొచ్చంటున్నారు నిపుణులు.

Latest Videos

click me!