వయసు పెరిగే కొద్దీ.... ముఖంపై ముడతలు రావడం చాలా సహజం. ఆ వచ్చిన ముడతలను కవర్ చేయడానికి ఏవోవో క్రీములు, మేకప్ లు వేస్తూ ఉంటారు. అయితే... ఎలాంటి మేకప్ లు లేకుండా.. కొన్ని సహజ ఉత్పత్తులు, అవి కూడా ఇంట్లో లభించే వాటితో కూడా ఈ ముడతలను శాశ్వతంగా తొలగించవచ్చు. అవేంటో ఓసారి చూద్దాం..
alovera plant
1.కలబంద గుజ్జు..
కలబంద.. మనకు చాలా ఈజీగా లభిస్తుంది. చాలా మంది తమ ఇళ్లల్లోనే పెంచుకుంటూ ఉంటారు.ఈ కలబందలో యాంటీ సెప్టిక్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని అందంగా మార్చడంలో సహాయపడతాయి. ముఖంపై ముడతలను ఈజీగా తొలగించడానికి సహాయపడతాయి. అంతేకాకుండా... చర్మం యవ్వనంగా కనిపించడంలోనూ హెల్ప్ చేస్తుంది.
దీనిని ఎలా ఉపయోగించాలి అంటే...
కలబంద గుజ్జు తీసుకొని... మంచిగా ముఖానికి అప్లై చేయాలి. తర్వాత.. మంచిగా చర్మంలోకి ఇంకిపోయేలా మసాజ్ చేయాలి. వారానికి మూడు సార్లు.. ఇలా వాడితే సరిపోతుంది.
eggs
2.కోడిగుడ్డు..
కోడి గుడ్లు సహాయంతో, ముఖం ముడతల సమస్యను తగ్గించవచ్చు. గుడ్లు అనేక విటమిన్లు కలిగి ఉంటాయి. ఇది ప్రోటీన్లను కూడా కలిగి ఉంటుంది, దీని సహాయంతో ముడతల సమస్యను తగ్గించవచ్చు. కోడిగుడ్లను ఉపయోగించడం వల్ల ముఖంలో మెరుపు వస్తుంది.
దీన్ని ఇలా ఉపయోగించండి...
గుడ్డు పగలగొట్టి అందులోని తెల్లని భాగాన్ని బయటకు తీయాలి.
ఈ తెల్లని భాగాన్ని బాగా కొట్టండి.
దీన్ని ముఖానికి పట్టించాలి.
అది ఆరిన తర్వాత, మీ ముఖాన్ని శుభ్రం చేసుకోండి.
దీని తరువాత, ముఖాన్ని మాయిశ్చరైజర్ రాసుకుంటే సరిపోతుంది. ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల ముఖంపై ముడతలు తొలగిపోయి..యవ్వనంగా కనిపించేలా చేస్తాయి.