నెటిజన్ల మనసు గెలిచిన అంబానీ చిన్న కోడలు.. ఎందుకో తెలుసా?

First Published | Aug 2, 2024, 4:39 PM IST

ఈ ఫోటోలు, వీడియోల్లో రాధికను చూసి నెటిజన్లు మురిసిపోతున్నారు. మరోసారి ఆమె నెటిజన్ల మనసు గెలుచుకుంది. ఇంతకీ రాధిక ఏం చేసింది అంటే..

మన దేశ కుబేరుడు ముకేష్ అంబానీ రీసెంట్ గా తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసిన విషయం తెలిసిందే. దాదాపు రూ.5వేల కోట్లు ఖర్చు చేసి మరీ వివాహం జరిపించారు. వివాహం తర్వాత.. న్యూలీ వెడ్డింగ్ కపుల్ అనంత్ - రాధికలు..  ఫారిన్ ట్రిప్ కి వెళ్లారు. ఈ ట్రిప్ లో భాగంగా ప్రస్తుతం ఈ కొత్త జంట పారిస్ లో ఉన్నారు.

కాగా.. వారు పారిస్ లో ఉన్న ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. ఈ ఫోటోలు, వీడియోల్లో రాధికను చూసి నెటిజన్లు మురిసిపోతున్నారు. మరోసారి ఆమె నెటిజన్ల మనసు గెలుచుకుంది. ఇంతకీ రాధిక ఏం చేసింది అంటే..


ప్రస్తుతం పారిస్ లో ఒలంపిక్స్ జరుగుతున్న విషయం తెలిసిందే.  ఈ ఒలంపిక్స్ చూడటానికి అనంత్ - రాధికలు మాత్రమే కాదు.. కంప్లీట్ అంబానీ ఫ్యామిలీ అక్కడికి వెళ్లింది.  తాజాగా వైరల్ అవుతున్న ఓ ఫోటోలో.. అంబానీ ఫ్యామిలీ మొత్తం ఏదో ఒలంపిక్ మ్యాచ్ ని ఇంట్రస్ట్ గా చూస్తున్నారు. అయితే.. ఆ ఫోటో, వీడియోలో రాధిక లుక్ కి అందరూ ఇంప్రెస్ అయిపోతున్నారు.

ఆమె మోడ్రన్ డ్రెస్ వేసుకున్నా... ఫారిన్ లో ఉన్నా  కూడా తన మెడలో నుంచి మంగళసూత్రం మాత్రం తీయలేదు. చాలా స్పష్టంగా  మంగళసూత్రం ఆమె మెడలో కనపడుతుండటం విశేషం. అంతే.. ఆ ఫోటోలో రాధిక ను చూసి నెటిజన్లు తెగ ఇంప్రెస్ అయిపోయారు. ఆమెపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. 

రాధికకు ప్రజల పల్స్ బాగా తెలుసు అని.. ఇప్పుడు తాను మంగళసూత్రం వేసుకోకుంటే.. కచ్చితంగా ట్రోల్ చేస్తారని తనకు తెలుసు అని.. అందుకే వేసుకుంది అంటూ చాలా మంది కామెంట్ చేయడం గమనార్హం. కొందరు మాత్రం రాధిక చాలా డీసెంట్ అని, సో స్వీట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చాలా కొద్ది మంది మాత్రం.. న్యూ కపుల్ ని హ్యాపీగా హనీమూన్ వెళ్లనివ్వకుండా.. ఒలంపిక్ మ్యాచ్ లు చూపిస్తున్నారేంటి అంటూ కామెంట్స్ చేస్తుండటం విశేషం. 


ఇక, జూలై 12న రాధిక, అనంత్‌ల వివాహం జరిగింది. దాదాపు ఆరు నెలల పాటు వీరి  పెళ్లికి సన్నాహాలు చేశారు. అంబానీ ఇంట్లో 15 రోజుల పాటు ప్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్ కార్యక్రమాలు జరిగాయి. రాధిక, అంబానీల వివాహానికి హాలీవుడ్, బాలీవుడ్ సహా ఇండస్ట్రీలోని ప్రముఖులు హాజరయ్యారు.

Latest Videos

click me!