చర్మ సంరక్షణలో ఏవి మంచివి అంటే చెప్పడం సులభమే. కానీ ఏవి మంచివి కావు అంటే చెప్పడం కష్టం. విటమిన్ సి, ఇ, హైలురోనిక్ యాసిడ్ , సెరామైడ్లు - వీటిల్లో ఏ కాంపౌండ్ మంచిది అనేది చెప్పడం కొంచెం కష్టమే. ముఖ్యంగా చర్మసంరక్షణలో ఆల్కహాల్ విషయానికి వచ్చేసరికి అలాంటి ప్రశ్నే తలెత్తుతుంది.
undefined
చర్మ సంరక్షణ ఉత్పత్తుల్లో ఉండే ఆల్కహాల్ చర్మానికి హానికరమా? వీటిని నిత్యవాడకం నుంచి తొలగించడం మంచిదా? ఆల్కహాలును ఎంతో కాలంగా స్కిన్ కేర్ ప్రాడక్ట్స్ లో ప్రిజర్వేటివ్ గా వాడుతున్నారు.
undefined
అయితే ఇది మాయిశ్చరైజర్లను రాన్ సిడ్ చేస్తుంది. చర్మాన్ని బాగా పొడిబారేలా చేస్తుంది. అయితే ఎంత ఎక్కువ చేస్తుంది అనేది స్పష్టత లేదు.
undefined
ఆల్కహాల్ రెండు రకాలుగా ఉపయోగపడుతుంది. ప్రిజర్వేటివ్, సాల్వెంట్ రెండు లక్షణాలను కలిగి ఉంటుంది. చర్మసౌందర్య ఉత్పత్తుల్లో వీటిని తరచుగా వాడుతుంటారు. దీనివల్ల ఇవి వాడకానికి అనువుగా తయారవుతాయి. అయితే వీటిల్లో ఈథనాల్ ను చర్మసంరక్షణకు హానికలిగించేదిగా చూస్తాం.
undefined
ఇథనాల్ పొడిబారేలా చేస్తుంది, ఇరిటేటింగ్ కలిగిస్తుంది. ఎక్కువ ఘాడత కలిగిన ఇథనాల్ చర్మానికి హాని కలిగిస్తుంది. మిగతా రసాయనాల్ని చర్మం శోషించుకోకుండా చేస్తుంది. చర్మం సహజతత్వాన్ని మార్చేస్తుంది.
undefined
మరి ఎలా.. ఆల్కహాల్ ను దూరం పెట్టడం ఎలా? అంటే చర్మ సంరక్షణ ఉత్పత్తు నుంచి దీన్ని పూర్తిగా తొలగించడం సాధ్యం కాదు. కాబట్టి అవి తక్కువగా ఉన్న ఉత్పత్తులను చూసి కొనుక్కోవాలి. అలాగని దాన్ని పూర్తిగా తొలగించడం కూడా మంచిది కాదు.
undefined
అలాగే మేకప్ ను రిమూవ్ చేయడానికి, వైబ్స్ లో ఈ ఆల్కహాల్ కంటెంట్ ఉంటుంది. వాటిని చూసుకుని ఎంపిక చేసుకోవడం మంచిది.
undefined