ఆడపిల్లల వివాహానికి కనీస వయసు ఎంతో తెలుసా? మన దేశంలో అయితే 18ఏళ్లు. ఇది త్వరలోనే 21ఏళ్లకు పెరగనుంది. అయితే.. 21ఏళ్లకు పెళ్లి చేసుకోమని అంటూనే ఈ కాలం అమ్మాయిలు అసలు వినడం లేదు. అప్పుడే మాకు పెళ్లి అంటి అని అంటున్నారు. అలాంటిది ఓ దేశంలో అమ్మాయిల పెళ్లి వయసును 9ఏళ్లకు మార్చాలని ఆ దేశం భావిస్తోంది. ఆ దేశం మరేంటో కాదు.. ఇరాక్.
అక్కడ.. అబ్బాయిల వివాహ వయసును 18ఏళ్ల నుంచి 15ఏళ్లకు మార్చడమే కాకుండా... అమ్మాయిల వివాహ వయసును ఏకంగా 9 ఏళ్లకు మార్చాలని వివాదాస్పద బిల్లును ఇరాక్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు.
child marriage
ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికలలో సంస్కరణవాద ప్రభుత్వం ఉనికిలోకి వచ్చింది, అయినప్పటికీ అటువంటి బిల్లును ముందుకు తీసుకురావడం, తీవ్ర విమర్శలు వస్తుండటం గమనార్హం.
ఈ బిల్లు ఆమోదం పొందితే ఇరాక్‌లో బాల్య వివాహాలు పెరుగుతాయని మానవ హక్కుల సంస్థలు, మహిళా హక్కుల సంస్థలు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ నిర్ణయం ఇరాక్‌లో లింగ వివక్షను పెంచవచ్చు. ఆడపిల్లల చదువులు కూడా దెబ్బతినే అవకాశం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న వయసులోనే గర్భం దాల్చడం, గృహ హింస పెరగవచ్చు.
Child marriage web story
దీనితో పాటు, వివాహం తర్వాత తలెత్తే ఏదైనా వివాదాన్ని కోర్టులు లేదా మతపరమైన కోర్టులు పరిష్కరించాలా అని జంట ముందే నిర్ణయించుకోవాలని కూడా వివాదాస్పద బిల్లు పేర్కొంది. ఇరాక్ షరియా చట్టానికి అనుబంధంగా రూపొందించిన ఈ చట్టం పలు వివాదాలకు కారణమైంది.
ఇరాక్‌లో బాలికల వివాహ వయస్సును తగ్గించాలనే ప్రతిపాదన గత జూలైలో సమర్పించారు, అయితే పార్లమెంటు సభ్యుల నుండి వ్యతిరేకత కారణంగా బిల్లు ఆమోదం పొందలేదు. UNICEF ప్రకారం, ఇరాక్‌లో 28 శాతం మంది అమ్మాయిలు 18 ఏళ్లలోపు పెళ్లి చేసుకుంటున్నారు.