హీరోయిన్ అనుష్క శర్మను ఫాలో అయితే.. 30 ఏండ్లు దాటినా అందంగా కనిపిస్తారు..

First Published | Aug 10, 2024, 1:54 PM IST

అనుష్క శర్మకు ఇప్పుడు 36 ఏండ్ల వయసు ఉంటుంది. అయినా ఆ హీరోయిన్ అస్సలు అలా కనిపించదు కదా.. ఇలా కనిపించకూడదనే ఈమె కొన్ని చిట్కాలను ఫాలో అవుతుంది. మీరు కూడా ఆమెలా చేస్తే 30 ఏండ్లు దాటినా మీ వయసు కనిపించదు. అలాగే నిత్య యవ్వనంగా ఉంటారు.
 

వయసు పెరుగుతున్న కొద్దీ..  తెల్ల వెంట్రుకలు రావడం, చర్మం ముడతలు పడటం చాలా సహజం. మన వయసు పెరుగుతున్న సంగతి మన చర్మమే చెబుతుంది. కానీ కొంతమందికి ఎంత వయసొచ్చినా.. చర్మం మాత్రం యవ్వనంగానే ఉంటుంది. ఇలాంటి వారిలో అనుష్క శర్మ ఒకరు. అవును అనుష్క శర్మ వయసు ప్రస్తుతం 36 ఏండ్లు. అయినా అలా అస్సలు కనిపించదు. ఈమెలా మీరు కూడా అందంగా కనిపించాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

క్లీనింగ్

అనుష్క శర్మ అందంగా కనిపించడానికి ప్రతిరోజూ సున్నితంగా ముఖాన్ని క్లీన్ చేస్తుంది. తేలికగాశుభ్రపరచడం వల్ల చర్మంలోని మలినాలు తొలగిపోతాయి. దీంతో మీ చర్మం కాంతివంతంగా, బ్యూటీఫుల్ గా కనిపిస్తుంది. 



హైడ్రేషన్ 

అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం మీరు ప్రతిరోజూ నీళ్లను పుష్కలంగా తాగాలి. అనుష్క శర్మ తనను తాను హైడ్రేట్ గా ఉంచుకోవడానికి ప్రతిరోజూ 8 నుంచి 9 గ్లాసుల నీళ్లను తాగుతుంది. వాటర్ మన శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపడానికి కూడా సహాయపడతాయి. 
 

సన్‌స్క్రీన్‌

అనుష్క శర్మ అందంగా కనిపించడానికి ప్రతిరోజూ సన్ స్క్రీన్ ను ఖచ్చితంగా వాడుతుంది. ఈ సన్ స్క్రీన్ మన చర్మాన్ని సన్‌బర్న్ నుంచి రక్షించడానికి ఉపయోగపడుతుంది. ఈ సన్ స్క్రీన్ అనుష్క శర్మ చర్మానికి మంచి పోషణను అందిస్తుంది. అలాగే తేమగా కూడా ఉంచుతుంది. 
 


నిద్ర

సెలబ్రిటీలు అందంగా కనిపించే సీక్రేట్స్ లో నిద్ర కూడా ఒకటి. అవును వీళ్లు ఎంత బిజీగా ఉన్నా.. నిద్రకు మాత్రం మంచి సమయాన్ని కేటాయిస్తారు. కంటినిండా నిద్రపోతేనే శరీరం, చర్మం ఆరోగ్యంగా ఉంటాయి. అందుకే అనుష్క శర్మ ప్రతిరోజూ రాత్రి 7-8 గంటలు నిద్రపోతుందట. 
 

 మేకప్

హీరోయిన్లు ఎంత మేకప్ వేసుకుంటారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మేకప్ వల్ల అందంగా కనిపించినా.. ఇది ఒంటికి ఎక్కువ సేపు ఉంటే చర్మ సమస్యలు వస్తాయి. అందుకే వీళ్లు పడుకునే ముందు మేకప్ మొత్తం తొలగిస్తారట. అనుష్క శర్మ పడుకునే ముందు ఏ మేకప్ లేకుండాచేసి చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సున్నితమైన ప్రక్షాళనను వర్తింపజేస్తుందట.
 

Latest Videos

click me!