జుట్టు ఒత్తుగా పెరగాలని, ఉన్న జుట్టు రాలిపోకూడదని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. దాని కోసం మార్కెట్లో దొరికే అన్ని నూనెలు, షాంపూలు, కండిషనర్లు వాడుతూ ఉంటారు. జుట్టు పెరగడానికి చాలా మంది.. రాత్రిపూట తలకు నూనె రాసి.. ఉదయాన్నే తలస్నానం చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల.. జుట్టుకు ఆయిల్ బాగా పట్టి.. మంచిగా, మృదువుగా మారుతుందని.. అనుకుంటారు.