చీరలో సన్నగా కనపడాలంటే ఏం చేయాలో తెలుసా?

First Published | Oct 30, 2024, 11:57 AM IST

మనం చీర కట్టుకునే సమయంలో  కొన్ని సింపుల్ ట్రిక్స్ వాడితే.. ఎలాంటి చీర కట్టుకున్నా సరే సన్నగా కనపడొచ్చట. మరి, ఆ ట్రిక్స్ ఏంటో చూద్దాం…

పండగ, ఫంక్షన్ సమయంలో మహిళలు చీర కట్టుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. చీర మన భారతీయ సంస్కృతికి ప్రతిరూపం. అంతేకాకుండా.. ఎవరైనా సరే, చీర కట్టుకుంటే  వచ్చే అందం, హుందాతనం మరే  డ్రెస్ లోనూ రాదు అనే చెప్పాలి. అయితే.. కొందరికి చీర కట్టుకోవడం నచ్చదు. ఎందుకంటే చీరలో తాము లావుగా కనపడతాం అని భయపడుతూ ఉంటారు. కొంచెం బొద్దుగా ఉన్నవారు అయినా సరే చీర కట్టుకోవాలంటే ఇష్టపడరు. అయితే… మనం చీర కట్టుకునే సమయంలో  కొన్ని సింపుల్ ట్రిక్స్ వాడితే.. ఎలాంటి చీర కట్టుకున్నా సరే సన్నగా కనపడొచ్చట. మరి, ఆ ట్రిక్స్ ఏంటో చూద్దాం…

చీరలో పొడవుగా, సన్నగా కనపడాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

మనం ఎలా కనపడతాం అనేది మనం ఎంచుకునే ఫ్యాబ్రిక్ మీద ఆధారపడి ఉంటుంది. అందుకే.. ముందుగా మీరు ఎంచుకునే చీర ఫ్యాబ్రిక్ చాలా తేలికగా ఉండేలా చూసుకోవాలి. బెనారస్ లేదంటే కాంచీపురం  వంటి చీరలు మీ లుక్ ని మరింత హెవీగా చేరస్తాయి. కాబట్టి.. వాటికి బదులుగా జార్జెట్, షిఫాన్, క్రేప్ వంటి క్లాత్ లు ఎంచుకోవాలి. వీటి వల్ల మీరు సన్నగా కనపడతారు.

తేలికపాటి ఫాబ్రిక్ ఎంచుకోండి

బనారసి లేదా కాంచీపురం వంటి భారీ చీరలు మీ రూపాన్ని మరింత హెవీగా చేస్తాయి. కాబట్టి, వీటికి బదులు జార్జెట్, షిఫాన్, క్రేప్ తదితర తేలికపాటి బట్టలను ఎంచుకోవడం మంచిది. దీంతో శరీరం నాజూగ్గా తయారవుతుంది.


స్ట్రెయిట్ పల్లూ..

స్ట్రెయిట్ పల్లూ ని పెట్టుకోవడం వల్ల.. మీరు.. మీ దుస్తులపై అదనపు భారం తగ్గిన అనుభూతి కలుగుతంది. దాని వల్ల మీరు సన్నగా కనిపించే అవకాశం ఉంటుంది. ఇక పల్లూ వెనక భాగంలోనూ సన్నగా, పొడవుగా ఉంచాలి. దీని వల్ల మీరు సన్నగా కనపడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది.

చీరను నడుముకు ఎత్తుగా కట్టండి

చీరను కొంచెం ఎత్తులో, అంటే సహజమైన నడుముకు ఎగువన కట్టండి. ఈ విధంగా మీ కడుపు ప్రాంతం కప్పబడి ఉంటుంది.మీరు పొడవుగా, సన్నగా కనిపిస్తారు.

మడతలను సన్నగా ఉంచండి

మీరు చీరలో ప్లీట్స్  వేసిన ప్రతిసారీ  వాటిని వెడల్పుగా ఉంచకుండా, వాటిని సన్నగా ఉంచి, బాగా నొక్కాలి. ఇలా చేస్తే మీరు సన్నగా కనిపించే అవకాశం ఉంటుంది.

ఎంచుకునే ప్రింట్స్, కలర్స్ కూడా ముఖ్యం…

ముదురు నీలం, నలుపు, మెరూన్ వంటి ముదురు రంగులు మీరు సన్నగా కనిపించడంలో సహాయపడతాయి. ఈ రంగులు శరీరానికి స్లిమ్, ఫార్మల్ లుక్‌ను అందిస్తాయి, మీ మొత్తం రూపాన్ని సన్నగా మారుస్తాయి. 

బ్లౌజ్ డిజైన్…

మీరు సన్నగా కనిపించాలి అంటే.. బ్లౌజ్ డిజైన్ కూడా ఎంచుకోవడం ముఖ్యం. మీ చేతులు లావుగా ఉంటే.. స్లీవ్ లెస్ లాంటివి ఎంచుకుంటే మరింత లావుగా కనపడతారు. కాబట్టి.. మీరు ఫుల్ స్లీవ్ లేదంటే.. లాంగ్ స్లీవ్స్ ఉన్న బ్లౌజ్ ని ఎంచుకోవాలి.

Latest Videos

click me!