మిగిలిన చపాతీ పిండి ఫ్రెష్ గా ఉండాలంటే ఏం చేయాలి?

First Published | Oct 30, 2024, 10:46 AM IST

చాలా సార్లు చపాతీని పిండిని ఎక్కువగా కలిపేస్తుంటాం. వాటన్నింటిని చేసేంత టైం ఉండకపోవచ్చు. కానీ కలిపిన చపాతీ పిండి ఎక్కువ సేపు ఉంటే వాసన వచ్చి చెడిపోతుంది. ఇలా కాకూడదంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

chapati

చాలా మంది చపాతీలను ప్రతిరోజూ తింటుంటారు. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళ వీటిని ఎక్కువగా తింటుంటారు. బరువు తగ్గాలనుకునేవారైతే రోజుకు రెండూ పూటలా వీటినే తింటుంటారు. ప్రస్తుత కాలంలో జొన్న రొట్టెల వాడకం తగ్గి, చపాతీల వాడకం ఈ రోజుల్లో బాగా పెరిగిపోయింది.  

అయితే చాలా మంది ఇండ్లలో చపాతీని పిండిని అప్పటికప్పుడే కలిపి చపాతీలను వేడివేడిగా తింటుంటారు. ఎందుకంటే ఎప్పుడో కలిపిన పిండి దుర్వాసన రావడమే కాకుండా.. పిండి కూడా పాడవుతుంది.

ఇలాంటి పిండితో చేసిన చపాతీలు టేస్టీగా కూడా ఉండవు. అయితే మీరు కొన్ని చిట్కాలను పాటిస్తే మాత్రం మిగిలిపోయిన చపాతీ పిండి ముద్ద ఫ్రెష్ గా ఉంటుంది. చపాతీలు కూడా ఎలాంటి వాసన రావు. ఇందుకోసం ఏం చేయాలంటే? 

కలిపిన చపాతీ పిండి ఎక్కువ సేపు ఫ్రెష్ గా ఉండాలంటే .. ఆ పిండిని చల్లనీళ్లతో కలపాలి. ఇది కలిపిన పిండి ముద్దను ఎక్కువ సేపు ఫ్రెష్ గా ఉంచేందుకు సహాయపడుతుంది.

అలాగే మీరు చపాతీలు చేయగా మిగిలిన పిండి ముద్దను సులువుగా ఫ్రిజ్ లో పెట్టొచ్చు. ఇలా కాకుండా.. నార్మల్ గా పిండిని కలిపితే మాత్రం మీరు కొంచెం సేపు ఫ్రిజ్ లో పెట్టినా పిండి గట్టిపడుతుంది. తేమ కూడా ఉండకుండా పోతుంది. 

మీకు తెలుసా? కలిపిన పిండిని సరిగ్గా నిల్వ ఉంచితే అది రెండు మూడు రోజులైనా ఫ్రెష్ టా ఉంటుంది. అందుకే కలిపి పెట్టుకున్న పిండిని ఎలా సరిగ్గా నిల్వ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

Latest Videos


చల్లని నీళ్లు 

పిండిని కూల్ వాటర్ తో కలుపుకోవడం వల్ల అది ఎక్కువ సేపు తాజాగా ఉంటుంది. మీకు తెలుసా? కూల్ వాటర్ పిండిని త్వరగా చెడిపోకుండా చేస్తుంది. ముఖ్యంగా వేసవిలో. అయితే ఇప్పుడు వాతావరణం చల్లగా ఉంది. అయినా.. కూల్ వాటర్ తో కలుపుకుంటే పిండి పాడవకుండా ఉంటుంది. అలాగే పిండిని కలిపేటప్పుడు కూల్ వాటర్ తో మెత్తగా చేసుకోవాలి. కూల్ వాటర్ పిండిని కొద్దిసేపు తాజాగా ఉంచుతుంది. 

ఫ్రిజ్ లో ఉంచాలి

కలిపిన పిండి ఎక్కువ సేపు నిల్వ ఉండాలంటే.. అత్యంత ఎఫెక్టీవ్ మార్గం.. దీనిని ఫ్రిజ్ లో పెట్టడం. ఫ్రిజ్ లో పెడితే పిండి చాలా సేపటి వరకు ఫ్రెష్ గా ఉంటుంది. ఇందుకోసం ఈ పిండిని గాలి చొరబడని కంటైనర్ లో పెట్టండి. లేదా ఫ్రిజ్లో ఉంచే ముందు క్లింగ్ ఫిల్మ్ లో బాగా చుట్టండి. అలాగే శీతలీకరణ పిండిని 2-3 రోజుల వరకు ఫ్రెష్ గా ఉంచుతుంది. పాడయ్యే అవకాశాలు కూడా తగ్గుతాయి. 
 

నూనె 

కలిపి పెట్టుకున్న పిండి ఎండిపోకుండా ఉండాలంటే పిండి ముద్దపై మొత్తం నూనెను రాయండి. ఇది పిండి ఎండిపోకుండా చేస్తుంది. అలాగే పిండి పైన కొన్ని చుక్కల నూనె వేసి రుద్దండి. ఆ తర్వాత కంటైనర్ లో పెట్టండి. ఇది పిండిని ఎక్కువ సేపు ఫ్రెష్ గా ఉంచుతుంది. అలాగే పిండి మెత్తగా అవుతుంది. 

ఫ్రీజర్ లో ఉంచండి

మీరు పిండిని కొన్ని రోజుల పాటు నిల్వ చేయాల్సి వస్తే గనుక దీన్ని ఫ్రీజర్ లో ఉంచండి. ఇందుకోసం పిండిని చిన్న భాగాలుగా విభజించి ఫ్రీజర్లో నిల్వ చేయాలి. అయితే దీన్ని ఉపయోగించినప్పుడల్లా దానిని బయటకు తీసి గది ఉష్ణోగ్రత వద్ద ఉంచండి.

ఇలా చేస్తే కలిపిన పిండి ఒకటి రెండు వారాలైనా పిండి ఫ్రెష్ గా ఉంటుంది. ఫ్రీజర్ ఇందుకు  బాగా సహాయపడుతుంది. దీనితో రోజూ పిండిని కలిపే ఇబ్బంది ఉండదు. 


నిమ్మరసం కలపండి

ఎండాకాలంలో కలిపి పెట్టుకున్న పిండి చాలా త్వరగా పాడవుతుంది. ఇలా కాకూడదంటే పిండిలో నీళ్లతో పాటుగా కొంచెం నిమ్మరసం వేసి కలపండి. మీకు తెలుసా? నిమ్మరసం నేచురల్ ప్రిజర్వేటివ్ గా పనిచేస్తుంది. పిండి పాడవకుండా కాపాడుతుంది. ఇందుకోసం పిండిని కలిపేటప్పడుు దాంట్లో అర టీస్పూన్ నిమ్మరసాన్ని కలపండి. ఇది పిండిని తాజాగా ఉంచుతుంది. అలాగే త్వరగా చెడిపోనివ్వదు. 

ఫాయిల్ పేపర్ లో చుట్టండి

కలిపి పెట్టుకున్న పిండిని ఫాయిల్ పేపర్ లో చుట్టి పెట్టినా పిండి చాలా సేపటి వరకు ఫ్రెష్ గా ఉంటుంది. ఎలాంటి వాసనా రాదు. ఇందుకోసం పిండిని చిన్న భాగాలుగా చేసి వాటిని ఫాయిల్ పేపర్ లో చుట్టండి. ఇది పిండిలో తేమను నిలుపుతుంది. త్వరగా ఎండిపోనివ్వదు. 

click me!