18కేజీల బరువు తగ్గిన నీతా అంబానీ, డైట్ సీక్రెట్ ఇదే..!

First Published Sep 25, 2024, 2:17 PM IST

ఆసియాలోనే అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ కి పరిచయం అవసరం లేదు. పేరుకే ఆమె వయసు 60. కానీ..చూడటానికి మాత్రం 30 ఏళ్ల మహిళలా కనపడతారు. మరి, ఆమె అంత ఫిట్ గా ఉండటానికి, బరువు కంట్రోల్ లో ఉంచుకోవడానికి, అందంగా కనపడటానికి ఏం చేస్తారో ఇప్పుడు చూద్దాం..

మన దేశ కుబేరుడు ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీకి పరిచయం అవసరం లేదు.  ఆమె తన అందం, ఫిట్నెస్ తో ఎఫ్పటికప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తూనే ఉంటారు. ఆమె తన చీరలు, జ్యూవెలరీలతో ఫ్యాషన్ ప్రియులను ఎప్పటికప్పడు ఆకట్టుకుంటూనే ఉంటారు. నీతా అంబానీ కేవలం ముఖేష్ భార్యగా మాత్రమే కాదు... రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్ట్ గా, రిలయన్స్ ఫౌండేషన్, ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ ఛైర్ పర్సన్, వ్యవస్థాపకురాలిగా కూడా ఆమె వ్యవహరిస్తూ వస్తున్నారు. ఆ బాధ్యతలు నిర్వహిస్తూనే... నీతా.. తన అందం, ఫిట్నెస్ విషయంలో చాలా ఫోకస్డ్ గా ఉంటారు. ఒకప్పుడు చాలా బరువు ఉండే ఆమె... తన డైట్ తో.. ఏకంగా 18 కేజీల బరువు తగ్గింది అంటే మీరు నమ్ముతారా? దానికోసం ఆమె ఎలాంటి డైట్ ఫాలో అయ్యారో ఇప్పుడు తెలుసుకుందాం..

నీతా అంబానీ తన బరువు తగ్గించడానికి కఠినమైన వ్యాయామాలు ఏమీ చేయలేదు. కేవలం డైట్ మార్పులు చేసుకొని ఆమె బరువు తగ్గారు. అది కూడా..తన కొడుకు కోసం ఆమె తన డైట్ ని మార్చుకోవడం విశేషం. నీతా చిన్న కుమారుడు అనంత్ అంబానీ అధిక బరువు ఉంటాడనే విషయం తెలిసిందే. ఆ బరువు కారణంగా ఉబకాయం, ఆస్తమాతో బాధపడ్డాడు. స్టెరాయిడ్స్  వాడాలసి వచ్చింది. తన కొడుకు బాధను చూసి.. కొడుకు కోసం ఆమె తన డైట్ ని మార్చుకున్నారు.  తన కొడుకుతోపాటు.. ఆమె కూడా  హెల్దీ డైట్ ఫాలో అవ్వడం మొదలుపెట్టారట.

నీతా అంబానీ డైట్ ప్లాన్ ఇదే..

నీతా అంబానీ తన డైట్ బ్యాలెన్స్డ్ గా ఉండేాలా చూసుకునేవారు. అంటే.. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకుంటారట. ఇంట్లో తయారు చేసిన పండ్ల రసాలు, డ్రై ఫ్రూట్స్ తో కూాడిన అల్పాహారం తో తమ రోజుని ప్రారంభించేవారట. ఇక... తన చర్మాన్ని, బాడీని డీటాక్సిఫై చేసుకోవడానికి.. రెగ్యులర్ గా డీటాక్స్ డ్రింక్ తాగుతూ ఉంటారట.

బరువు తగ్గడం కోసం ఆమె ఏరోజూ మీల్స్ స్కిప్ చేయలేదట. తక్కువ తక్కువ ఆహారం ఎక్కువ సార్లు తీసుకుంటూ ఉంటారట. అంతేకాకుండా.. రెగ్యులర్ గా బీట్ రూట్ జ్యూస్ తాగుతూ ఉంటారట. నీతా అంబానీ, ఆమె భర్త ముఖేష్ అంబానీ కూడా గుజరాతీ స్టైల్ సూప్ వెరైటీలు , ఆకుకూరలు తింటారు. ఇంట్లో తయారుచేసిన చపాతీ లేదా పప్పుతో కూడిన భోజనాన్ని అంబానీ దంపతులు తింటారు.

Latest Videos


ఆహారం మాత్రమే కాకుండా నీతా అంబానీ తన మనస్సు , శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి క్లాసికల్ డ్యాన్స్ , యోగాను ప్రాక్టీస్ చేస్తూ ఉంటారట . ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తీసుకోవడం మానుకున్న ఆమె, మద్యపానాన్ని కూడా మానేశారు. నీతా అంబానీ శాఖాహారాన్ని మాత్రమే తింటారు.

మహిళలు 60 ఏళ్లు పూర్తి చేసుకునే సమయానికి, ఆరోగ్యకరమైన జీవనశైలిని నిర్వహించడం చాలా అవసరం. మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, దీర్ఘకాలిక వ్యాధులను నివారించడంలో, జీవిత నాణ్యతను పెంచడంలో ఫిట్‌నెస్ కీలక పాత్ర పోషిస్తుంది. శారీరక, మానసిక మార్పులను తీసుకురాగల సహజ వృద్ధాప్య ప్రక్రియ ఉన్నప్పటికీ, చురుకుగా ఉండటం , ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల మహిళ ఆరోగ్యం , దీర్ఘాయువుపై సానుకూల ప్రభావం పడుతుంది.

హృదయ ఆరోగ్యం

రెగ్యులర్ వ్యాయామం చేయడం వల్ల గుండె బలపడుతుంది, రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, గుండెపోటు , స్ట్రోక్ వంటి హృదయ సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. నడక, ఈత , సైక్లింగ్ వంటి కార్యకలాపాలు హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. రక్తపోటును తగ్గిస్తాయి. రెగ్యులర్ వ్యాయామం ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ స్థాయిలను నిమరుచుకోవడానికి సహాయపడుతుంది, అథెరోస్క్లెరోసిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

ఎముకల ఆరోగ్యం

60 ఏళ్లు పైబడిన మహిళల్లో ఎముకల సాంద్రత తగ్గడం వల్ల ఆస్టియోపోరోసిస్ , ఫ్రాక్చర్‌ల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. బరువు మోసే వ్యాయామాలు ఎముకల బలాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి. వెయిట్ లిఫ్టింగ్, యోగా , బ్రిస్క్ వాకింగ్ వంటి కార్యకలాపాలు ఎముకల నిర్మాణాన్ని ప్రోత్సహిస్తాయి.ఎముకల నష్టాన్ని తగ్గిస్తాయి.

కండర ద్రవ్యరాశిని నిర్వహించడం

వయస్సు పెరిగే కొద్దీ కండర ద్రవ్యరాశి సహజంగానే తగ్గుతుంది, ఇది బలహీనతకు , పడిపోవడం  గాయాల ప్రమాదం పెరుగుతుంది. రెగ్యులర్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కండర ద్రవ్యరాశిని ,బలాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది.

బరువు నిర్వహణ

మెటబాలిజం మందగించడం వల్ల వయస్సు పెరిగే కొద్దీ ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం చాలా కష్టమవుతుంది. వ్యాయామం బరువును నిర్వహించడానికి మరియు ఊబకాయం సంబంధిత పరిస్థితులను నివారించడానికి సహాయపడుతుంది. రెగ్యులర్ శారీరక శ్రమ కేలరీల వ్యయాన్ని పెంచుతుంది, ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి సహాయపడుతుంది. వ్యాయామం జీవక్రియను మెరుగుపరుస్తుంది మరియు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది.

మానసిక ఆరోగ్య ప్రయోజనాలు చురుకుగా ఉండటం మానసిక ఆరోగ్యానికి చాలా అవసరం, తగ్గిన ఆందోళన, నిరాశ , ఒత్తిడి మెరుగుపడిన అభిజ్ఞా పనితీరు వంటి ప్రయోజనాలను అందిస్తుంది. శారీరక శ్రమ ఎండార్ఫిన్లను విడుదల చేస్తుంది, ఇది మానసిక స్థితిని , మొత్తం శ్రేయస్సును పెంచుతుంది. రెగ్యులర్ వ్యాయామం అభిజ్ఞా క్షీణత , అల్జీమర్స్ వంటి వ్యాధుల తక్కువ ప్రమాదంతో ముడిపడి ఉంది.

నిద్రలేమి , వృద్ధులలో సాధారణం అయిన ఇతర నిద్ర సంబంధిత సమస్యలను ఎదుర్కోవడానికి సహాయపడుతుంది. వ్యాయామం మెరుగైన నిద్ర నాణ్యత , వ్యవధిని ప్రోత్సహిస్తుంది, మొత్తం ఆరోగ్యం , శ్రేయస్సుకు దోహదం చేస్తుంది.

click me!