తలస్నానం చేసే ముందు ఇలా చేస్తే.. జుట్టురాలదు..!

First Published | Jun 6, 2024, 1:55 PM IST

మంచిగా కుదుళ్లకు పట్టేలా.. చేయాలి. నూనెను కాస్త వేడి చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు తలకు పట్టిస్తే మరీ మంచిది. తర్వాత.. తలస్నానం చేస్తే సరిపోతుంది. 

hair care

ఈరోజుల్లో చాలా మంది మహిళలు జుట్టు విపరీతంగా రాలిపోతోంది. జుట్టు రాలడానికి ఎన్ని కారణాలు అయినా ఉండొచ్చు. కానీ.. సమస్య మాత్రం ఒక్కటే. ఈ జుట్టురాలడం సమస్య తగ్గడానికి చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే... మీరు ఏవేవో ఖరీదైన షాంపూలే, నూనెలు వాడే బదులు.. కొన్ని చిన్న హ్యాక్స్ వాడితే ఈ సమస్య నుంచి బయటపడొచ్చట. అది కూడా షాంపూ చేయడానికి ముందు ఇలా చేస్తే.... కచ్చితంగా జుట్టు రాలడం ఆగుతుందట.  అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..


జుట్టు బలహీనంగా మారినప్పుడు ఎక్కువగా రాలిపోతూ ఉంటుంది. కాబట్టి.. మనం జుట్టును స్ట్రాంగ్ చేయడానికి ప్రయత్నించాలి. దాని కోసం.. తలస్నానం చేసే ముందుు తలకు మంచిగా ఆయిల్ తో మసాజ్ చేయాలి. తలస్నానం చేయడానికి అరగంట ముందు ఈ పని చేయాలి. మంచిగా కుదుళ్లకు పట్టేలా.. చేయాలి. నూనెను కాస్త వేడి చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు తలకు పట్టిస్తే మరీ మంచిది. తర్వాత.. తలస్నానం చేస్తే సరిపోతుంది. 
 

Latest Videos


జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి, మహిళలు వారానికి రెండు రోజులు తమ జుట్టును కడగాలి. వారానికి ఒకసారి హెయిర్ మాస్క్‌ని కూడా ఉపయోగించాలి. హెయిర్ మాస్క్ ఉపయోగించడం వల్ల మీ జుట్టు ఆరోగ్యంగా , మృదువుగా మారుతుంది. హెయిర్ మాస్క్ ఉపయోగించిన తర్వాత, షాంపూతో మీ జుట్టును బాగా కడగాలి.

ఈ విషయాలను గుర్తుంచుకోండి
నూనె రాసేటప్పుడు తలకు బాగా మసాజ్ చేయండి.
స్కాల్ప్ ను బాగా శుభ్రం చేసుకోవాలి.
షాంపూ తర్వాత కండీషనర్ ఉపయోగించండి
తాపన సాధనాల వినియోగాన్ని తగ్గించండి
హెయిర్ ప్యాక్ ఉపయోగించండి
శిరోజాలను శుభ్రంగా ఉంచుకోవాలి.

click me!