జుట్టు పెరగాలంటే ఏం చేయాలి?

First Published | Oct 29, 2024, 11:49 AM IST

చాలా మందికి పొట్టి జుట్టే ఉంటుంది. జుట్టు పెరగడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా జుట్టు కొంచెం కూడా పెరగదు. కానీ  మీరు గనుక రోజూ కొన్ని పనులు చేస్తే మీ జుట్టు ఖచ్చితంగా పెరుగుతుంది. అవేంటంటే? 

అమ్మాయిలకు జుట్టు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క మహిళా ఒత్తైన, పొడవాటి జుట్టును ఇష్టపడుతుంది. ఇందుకోసం రకరకాల షాంపూలను, నూనెలను జుట్టుకు పెడుతుంటారు. అయినా జుట్టు కొంచెం కూడా పెరగని వాళ్లు చాలా మంది ఉన్నారు. 
 

జుట్టు పొడుగ్గా పెరగాలంటే జుట్టు సంరక్షణ సరిగ్గా ఉండాలి. ప్రతిరోజూ జుట్టును సరిగ్గా చూసుకోవాలి. అంతేకాదు కొన్ని అలవాట్లు మీకు ఖచ్చితంగా ఉండి తీరాలి. అప్పుడే మీరు కోరుకున్నట్టు మీ జుట్టు పొడుగ్గా, మందంగా పెరుగుతుంది. 

నిపుణుల ప్రకారం.. జుట్టు పెరగకపోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. వాతావారణ కాలుష్యం, నీటి కాలుష్యం, ఉప్పు నీళ్లతో స్నానం చేయడం, అంతర్గత, బహిర్గల పోషకాల లోపం వల్ల జుట్టు విపరీతంగా రాలుతుంది. అలాగే జుట్టు బలహీనంగా ఉంటుంది. ఇక జుట్టు పెరగడమంటూ అస్సలు ఉండదు. 

దీనికి తోడు మన రోజువారీ హెయిర్ స్టైల్స్ వల్ల కూడా జుట్టు చాలా ఫాస్ట్ గా పల్చబడుతుంది. మీకు కూడా హెయిర్ ఫాల్ సమస్య ఉంటే మీరు పెద్దగా చేయాల్సిందేమీ లేదు.

కానీ మీ రోజువారి అలవాట్లను మాత్రం ఖచ్చితంగా మార్చుకోవాలి. అలాగే మీ జుట్టుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. జుట్టు రాలకుండా, పొడుగ్గా పెరగాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 


సమతుల్య ఆహారం 

జుట్టుకు మంచి పోషణ అవసరం. ఇందుకోసం మీరు పోషకాలను పుష్కలంగా తీసుకోవాలి. నిపుణుల ప్రకారం.. మన జుట్టు ఆరోగ్యం మనం తినే ఆహారంతో ముడిపడి ఉంటుంది. శరీరం ఆరోగ్యంగా ఉండేందుకైనా, జుట్టు బలంగా, పొడుగ్గా పెరిగేందుకైనా అవసరమైన పోషకాలను తీసుకోవాలి. 

ముఖ్యంగా జుట్టు పెరగడానికి విటమిన్ ఎ, విటమిన్ ఇ, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్లు, బయోటిన్ చాలా అవసరం. ఇవి జుట్టు రాలడాన్ని కూడా చాలా వరకు తగ్గిస్తాయి.

ఇందుకోసం మీరు నట్స్, పండ్లు, కూరగాయలు, ఆకు కూరలను, గుడ్లు, చేపలు, గుడ్లు, పప్పుధాన్యాలను మీ రోజువారి ఆహారంలో చేర్చుకోవాలి. అంతేకాదు మీ జుట్టు తేమగా ఉండేందుకు రోజూ నీళ్లను పుష్కలంగా తాగాలి. 
 

రెగ్యులర్ హెయిర్ క్లెన్సింగ్, మాయిశ్చరైజింగ్

జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే.. జుట్టు పరిశుభ్రంగా ఉండాలి. అలాగే నెత్తి తేమగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. మన జుట్టుకు, నెత్తిమీద ఎంతో దుమ్ము, ధూళి ఉంటుంది. ఇది హెయిర్ ఫోలికల్స్ ను అడ్డుకుంటుంది. అలాగే జుట్టు పెరగడాన్ని ఆపేస్తుంది. అంతేకాకుండా వీటివల్ల మీ వెంట్రుకలు బాగా రాలిపోతాయి కూడా. 

అందుకే వారానికి రెండు మూడు సార్లైనా తేలికపాటి షాంపూతో జుట్టును వాష్ చేయాలి. అలాగే కండీషనర్ ను ఖచ్చితంగా ఉపయోగించాలి. తలస్నానం చేసిన తర్వాత జుట్టును సహజ పద్దతిలోనే బాగా ఆరబెట్టాలి. అలాగే నెత్తమీద తేమ ఉండాలంటే హెయిర్ ఆయిల్ లేదా సీరంను ఉపయోగించండి. 
 

తలకు మసాజ్ 

ప్రతిరోజూ తలకు మసాజ్ చేయడం వల్ల ఎన్నో లాభాలను పొందుతారు. ముఖ్యంగా మసాజ్ వల్ల మీ జుట్టు మూలాలకు రక్త ప్రసరణ పెరుగుతుంది. దీంతో మీ జుట్టు బాగా పెరగడం ప్రారంభిస్తుంది. ఆయిల్ మసాజ్ మీ నెత్తికి మంచి పోషణను అందిస్తుంది. అలాగే జుట్టుకు అవసరమైన తేమను కూడా అందిస్తుంది. 

ఇందుకోసం నెత్తికి కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్, బాదం నూనె, ఆమ్లా ఆయిల్ వంటి సహజ పదార్ధాలను ఉపయోగించిన నూనెను పెట్టండి. తర్వాత 5-10 నిమిషాల పాటు మసాజ్ చేయండి. వారానికి రెండు సార్లు నెత్తిని మసాజ్ చేస్తే మీ జుట్టు పాస్ట్ గా పెరుగుతుంది. 

ఒత్తిడిని తగ్గించుకోండి

ఎక్కువ ఒత్తిడికి గురైతే కూడా మీ జుట్టు పెరగడం చాలా వరకు తగ్గుతుంది. మీకు తెలుసా? ఒత్తిడి వల్ల మీ జుట్టు బలహీనంగా మారుతుంది. అలాగే వెంట్రుకల చివర్లు చిట్లిపోతాయి. వెంట్రుకలు తెగిపోతాయి. హెయిర్ ఫాల్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్య తగ్గాలంటే మీరు ఒత్తిడిని తగ్గించుకోవాలి. 

ఒత్తిడి తగ్గాలంటే ప్రతిరోజూ ధ్యానం చేయండి. యోగా చేయండి. రెగ్యులర్ గా వ్యాయామం చేయండి. ఇవి మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి. అలాగే ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడతాయి. అలాగే మీ జుట్టు పెరగడం కూడా చాలా వరకు పెరుగుతుంది. 


కత్తిరించిన జుట్టు

స్ప్లిట్ చివర్లను వదిలించుకోవడానికి జుట్టును తరచుగా కట్ చేయడం కూడా అవసరమే. రెండుగా చీలిన చివర్ల వల్ల జుట్టు పెరగడం తగ్గుతుంది. అందుకే ప్రతి 6-8 వారాలకు ఒకసారి  చివర్లను కట్ చేస్తుండండి. ఇది మీ జుట్టును ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా.. జుట్టు బాగా పెరగడానికి కూడా సహాయపడుతుంది. 

Latest Videos

click me!