బియ్యం, పప్పు, గోధుమలకు పురుగు పట్టకుండా ఉండేందుకు ఈ ఒక్క పనిచేస్తే సరి..

First Published Mar 27, 2024, 10:04 AM IST

బియ్యం, పప్పులు, జొన్నలతో పాటుగా ఇంట్లో ఎలాంటి ధాన్యాలు ఉన్నా.. కొంతకాలం తర్వాత పురుగులు ఖచ్చితంగా పడతాయి. వీటిని అలాగే వదిలేస్తే మొత్తాన్ని పాడు చేస్తాయి. మొత్తం తినేస్తాయి. అందుకే ధాన్యాలకు పురుగుపట్టకుండా చూసుకోవాలి. అయితే ఒక పద్దతి పురుగులు పట్టకుండా చేయడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది.
 

బియ్యం, జొన్నలు, పప్పులను మళ్లీ మళ్లీ ఎవరు కొంటారని చాలా మంది వీటిని ఒకేసారి ఎక్కువ మొత్తంలో తెచ్చుకుని ఇంట్లో పెడతారు. కానీ కొన్ని రోజుల తర్వాత పురుగు పడుతుంది. ఈ పురుగు ఒక్కొక్కటిగా పెరిగి చాలా అవుతాయి. ఒకదాని నుంచి మరొక దానిలోకి వెళ్లి ఇంట్లో ఉన్న బియ్యం, పప్పులు, జొన్నలు, గోధుమలను తినేస్తాయి. పనికిరాకుండా చేస్తాయి. వీటిని ఏం చేసినా పోగొట్టలేమని చాలా మంది అనుకుంటారు. కానీ ఒక సింపుల్ పద్దతిలో బియ్యానికి, గోధుమలు వంటి ఇతర ధాన్యాలకు పురుగుపట్టకుండా చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

గోధుమలు, బియ్యం బస్తాలో ఉప్పు వేస్తే ఏమౌతుంది? 

బియ్యం, గోధుమలు వంటి ధాన్యాలను నిల్వ చేసే సంచుల్లో ఉప్పును ఎప్పుడైనా కలిపారా? ఇలా చాలా తక్కువ మంది చేస్తారు. కానీ ఇది బియ్యానికి, గోధుమలకు పురుగులు పట్టకుండా చేసే చాలా పాత పద్దతి. ఉప్పుతో పురుగులు పట్టవా అని డౌట్ రావొచ్చు. కానీ పట్టవు. ఎందుకంటే ఉప్పులో సోడియం క్లోరైడ్ ఉంటుంది. ఈ వాసన వల్ల పురుగులు, కీటకాలు ధాన్యాల నుంచి పారిపోతాయి.
 

rice

ఇతర పద్దతులు

బియ్యాన్ని, పప్పులు, జొన్నలు వంటి ధాన్యాలను ఎక్కువ కాలం నిల్వ చేయడానికి మీరు వేప ఆకులను, అగ్గిపుల్లలు, లవంగాలు మొదలైన వాటిని కూడా ఉపయోగించొచ్చు. వీటికి కూడా పురుగులను పట్టకుండా చేసే లక్షణాలు ఉంటాయి. 

ఈ రోజు నుంచి ఇలా చేయండి

మీరు బియ్యాన్ని లేదా పప్పులు లేదా గోధుమలు మొదలైన  ధాన్యాలను నిల్వ చేసినప్పుడు వాటిని ఉంచే కంటెనైర్ లేదా సంచి క్లీన్ గా ఉందో లేదో చూసుకోండి. వాటిలో ధాన్యాలను పోయడానికి ముందు కాసేపు ఎండలో ఉంచండి. దీనితో పాటుగా ధాన్యాన్ని నిల్వ చేయడానికి ముందు ధాన్యాన్ని బాగా ఎండబెట్టండి.
 

ఎక్కువ రోజులు ధాన్యం నిల్వ ఉండాలంటే వాటిలో తేమ ఉండకూడదు. ధాన్యంలో తేమ కారణంగా అందులో కీటకాలు, ఫంగస్ ముప్పు పెరుగుతుంది. అలాగే ధాన్యాలున్న డబ్బాను నేరుగా నేలపై ఉంచకుండా కొంచెం ఎత్తులో ఉంచండి. ఇలా చేయడం వల్ల ధాన్యంలో తేమ ఉండదు. దీనితో పాటుగా ధాన్యాలను తేమగా ఉన్నదగ్గర వీటిని నిల్వ చేయకూడదు. 

click me!