ఒక్క రోజులో డార్క్ సర్కిల్స్ ను ఎలా తగ్గించుకోవాలి?

First Published Mar 26, 2024, 10:57 AM IST

నిద్రలేకపోవడం, ఫోన్, ల్యాప్ టాప్ వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను ఎక్కువ సేపు చూడటం వల్ల కళ్ల చుట్టు చర్మం నల్లగా మారుతుంది. కానీ ముఖానికి కళ్లే అందం కాబట్టి వీటివల్ల అందంగా తగ్గుతుంది. అయితే కొన్ని పద్దతులను ఫాలో అయితే ఒక్కరోజుల్లో ఈ డార్క్ సర్కిల్స్ ను తగ్గించుకోవచ్చు. అదెలాగంటే?
 

ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరూ ఒత్తిడికి గురవుతున్నారు. ఈ ఒత్తిడి వల్ల చాలా మందికి కళ్ల చుట్టూ డార్క్ సర్కిల్స్ వస్తున్నాయి. ఒక్క ఒత్తిడి వల్లే కాదు నిద్రలేమి, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను ఎక్కువగా చూడటం వల్ల నల్లటి వలయాలు ఏర్పడతాయి. కానీ ఇవి అంత తొందరగా పోవు. అలాగని అలాగే వదిలేస్తే రానురాను ఇంకా ఎక్కువ అవుతాయి. అందుకే వీటిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. అయితే కొన్ని పద్దతులను ఫాలో అవ్వడం వల్ల ఒక్కరోజులో డార్క్ సర్కిల్స్ ను తగ్గించుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
 

టమాటా-నిమ్మకాయ

ఒక్కరోజులో డార్క్ సర్కిల్స్ ను తగ్గించడానికి టమాటా, నిమ్మకాయ చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం ముందుగా ఒక గిన్నెను తీసుకుని అందులో టమాటా జ్యూస్ ను పోయండి. దీంట్లో కొన్ని చుక్కల నిమ్మరసం వేసి బాగా కలపండి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని కాటన్ సహాయంతో నల్లటి వలయాలపై అప్లై చేయండి.
 

ఎంతసేపు ఉంచాలి? 

ఈ మిశ్రమాన్ని డార్క్ సర్కిల్స్ కు పెట్టిన తర్వాత 10-15 నిమిషాలు అలాగే ఉంచండి. ఆ తర్వాత సాధారణ నీటితో కళ్లను శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కేవలం ఒక్క రోజులోనే తేడా కనిపిస్తుంది.
 

కీరదోసకాయ

కీరదోసకాయ మన ఆరోగ్యానికే కాదు అందానికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. దీన్ని డార్క్ సర్కిల్స్ ను తగ్గించుకోవడానికి కూడా ఉపయోగించొచ్చు. ఇందులో ఉండే గుణాలు కళ్ల కింద నల్లటి వలయాలను ఈజీగా తగ్గిస్తాయి.

dark circles

దోసకాయను ఎలా ఉపయోగించాలి? 

డార్క్ సర్కిల్స్ ను పోగొట్టడానికి సగం కీరదోసకాయను తీసుకుని సన్నగా తురుముకోవాలి. ఇప్పుడు దీన్ని డార్క్ సర్కిల్స్ మీద అప్లై చేయాలి. కావాలనుకుంటే కీరదోసకాయ ముక్కలను నేరుగా కూడా కళ్లపై పెట్టొచ్చు. కీరదోసకాయను ఉపయోగించడం వల్ల డార్క్ సర్కిల్స్ క్రమంగా తగ్గుతాయి. దీన్ని రోజూ ఉపయోగించడం ప్రయోజనకరంగా ఉంటుంది.
 

కలబంద గుజ్జు

డార్క్ సర్కిల్స్ ను తగ్గించుకోవడానికి మీరు కలబంద గుజ్జును కూడా ఉపయోగించొచ్చు. ఇందుకోసం కలబంద జెల్ ను తీసుకుని కళ్ల కింద అప్లై చేయండి. దీన్ని రాత్రిపూట పెట్టుకోవడం వల్ల మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ పద్దతులతో మీరు డార్క్ సర్కిల్స్ ను ఒక రోజులో చాలా వరకు తగ్గించుకోవచ్చు.

click me!