హోలీ పండగ అందరూ ఆనందగా జరుపుకునే ఉంటారు. ఈ పండగ రోజున అందరూ.... ఒకరితో మరొకరు రంగులు పూసుకుంటూ ఉంటారు. ఈ రంగులు పూసుకోవడం చాలా సరదాగానే ఉంటుంది. కానీ... ఆ రంగులు ముఖానికి మాత్రమే.. కాదు.. మన దుస్తులపై కూడా పడిపోతూ ఉంటాయి. కాస్త కష్టపడితే.. ముఖానికి అంటిన రంగులు అయినా తొలగిపోతాయేమో కానీ..దుస్తులకు అంటినవి మాత్రం అంత సింపుల్ గా వదలించలేము. ముఖ్యంగా... తెలుపు రంగు దుస్తులు వేసుకుంటాం కాబట్టి... ఆ రంగులు ఆ డ్రెస్ కి అంటుకొని.. తొందరగా వదలవు.. అయితే... ఈ కింది ట్రిక్స్ తో... ఆ రంగులు సులభంగా తొలగించవచ్చు. అవేంటో చూద్దాం..
lemon
1.నిమ్మకాయ..
నిమ్మకాయ రసం మంచి బ్లీచింగ్ ఏజెంట్ లా పని చేస్తుంది. మీరు కనుక రంగులు అంటిన ప్రదేశంలో.. నిమ్మరసం వేసి..రుద్ది ఉంచాలి.15 నిమిషాల పాటు అలా వదిలేయాలి. కాసేపు అలానే వదిలేసి.. ఆ తర్వాత శుభ్రం చేస్తే సరిపోతుంది. తొందరగా.. ఆ రంగులు వదులుతాయి.
2.వైట్ వెనిగర్..
నిమ్మకాయతో ప్రయత్నించిన తర్వాత కూడా రంగులు వదలకపోతే.. మీరు వెనిగర్ ప్రయత్నించవచ్చు. వైట్ వెనిగర్ కూడా.. సులభంగా మరకలు తొలగించడానికి ఉపయోగపడుతుంది. అరకప్పు వెనిగర్ తీసుకోవాలి. దాంట్లో ఒక టీస్పూన్ వాషింగ్ పౌడర్ వేసి బకెట్ నీటిలో వేసి బాగా కలపాలి. ఇప్పుడు అందులో... రంగులు అంటిన దుస్తులను నానపెట్టాలి. కాసేపు అలానే వదిలేసి.. తర్వాత శుభ్రం చేస్తే సరిపోతుంది. ఆ రంగులు.. శుభ్రంగా వదులుతాయి.
3.అమ్మోనియా బేస్డ్ క్లీనర్..
అమ్మోనియా బేస్డ్ క్లీనర్స్ ని.. దాదాపు గా ఇంట్లో గాజు వస్తువులను క్లీన్ చేయడానికి వాడతారు. దానిని... మీరు రంగులు వేసిన దుస్తులపై
స్ప్రే చేయాలి. ఆ తర్వాత... కాసేపు అలా ఉంచిన తర్వాత... మంచిగా రుద్ది.. శుభ్రం చేయాలి. ఇలా చేయడం వల్ల.. దుస్తులకు అంటిన రంగులు తొలగిపోతాయి.
washing machine
ఇక.. మరీ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే... హోలీ ఆడటం అయిపోన వెంటనే.. ఆ దుస్తులను పక్కన పెట్టొద్దు. వెంటనే శుభ్రపరచడం పై దృష్టి పెట్టాలి. అంటిన వెంటనే క్లీన్ చేయడానికి ప్రయత్నిస్తే.. తొందరగా తొలగిపోయే అవకాశం ఉంటుంది.
washing machine
ఇక.. పైన చెప్పిన.. రెమిడీలను ప్రయత్నించే సమయంలో.. చేతులకు గ్లోవ్స్ వేసుకోవడం మర్చిపోవద్దు. లేదంటే.. చేతులకు బొబ్బలు వచ్చే ప్రమాదం ఉంది.