ఉదయం, సాయంత్రం వంటగదిలో వంట చేయడం వల్ల గోడలపై నూనె, పొగతో జిడ్డు పేరుకుపోవడం మొదలవుతుంది. ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోతే గోడ నల్లగా మారుతుంది. అందుకే వంటగదిని రెగ్యులర్ గా శుభ్రం చేసుకోవాలి. అప్పుడే ఎన్నో వ్యాధులకు దూరంగా ఉంటాం. మీ వంటగది గోడపై కూడా జిడ్డు పేరుకుపోయి ఉంటే దానిని ఎలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
kitchen cleaning tips
వంటగది గోడ ఎందుకు మురికిగా ఉంటుంది?
వంటింట్లో వంట చేయడం వల్ల గోడపై నూనె పడి మొండి మరకలు ఏర్పడతాయి. ఈ గోడను సకాలంలో శుభ్రం చేయకపోతే గోడ చాలా మురికిగా కనిపిస్తుంది. దీనికి మురికి పేరుకుపోతుంది.
ముందుగా దుమ్మును శుభ్రం చేయాలి
వంటగది గోడపై ఉన్న జిడ్డును శుభ్రం చేసే ముదు దానిపై ఉన్న దుమ్మును ముందుగా బాగా శుభ్రం చేయాలి. అంతకంటే ముందు కిచెన్ కౌంటర్ లో ఉంచిన పాత్రలను అక్కడి నుంచి తీసేయాలి.
ఇలా క్లీనింగ్ సొల్యూషన్ తయారు చేయండి
గోడపై ఉన్న నూనె జిడ్డు అంత ఈజీగా క్లీన్ కాదు. అయితే ఇందుకోసం ఇంట్లోనే క్లీనింగ్ సొల్యూషన్ ను తయారు చేసుకోవచ్చు. ఇందుకు గోరువెచ్చని నీళ్లు, వెనిగర్, బేకింగ్ సోడా అవసరపడుతుంది.
క్లీనింగ్ సొల్యూషన్ ఎలా తయారు చేయాలి?
ముందుగా ఒక పాత్రలో వేడినీళ్లను తీసుకుని అందులో 3 టీస్పూన్ల వెనిగర్, బేకింగ్ సోడా తీసుకుని కలపండి. ఈ ద్రావణాన్ని స్పాంజ్ లో బాగా నానబెట్టండి. దీనితో గోడలను శుభ్రం చేసుకోవాలి.
చేతులకు గ్లౌజులు
వంటగది గోడను శుభ్రం చేయడానికి క్లీనింగ్ ద్రావణాన్ని ఉపయోగించేటప్పుడు మీ చేతులకు ఖచ్చితంగా గ్లౌజులు ధరించండి. ఆ తర్వాతే వాటర్ తో గోడలను కడగండి. ఈ ద్రావణం, నీటితో గోడను శుభ్రం చేసినప్పుడు టవల్ లేదా పొడి బట్ట సహాయంతో గోడను శుభ్రం చేయండి. ఇది మొండి నూనె మరకలను ఈజీగా క్లీన్ చేస్తుంది.
డిష్ వాషింగ్ లిక్విడ్
మరకలు చాలా లోతుగా ఉంటే పైన చెప్పిన ద్రావణంతో క్లీన్ చేసిన తర్వాత డిష్ వాషింగ్ లిక్విడ్ సహాయంతో లిక్విడ్ సహాయంతో గోడను శుభ్రం చేయండి. దీని తర్వాత గోడపై ఉన్న సబ్బును కాటన్ వస్త్రంతో కడగండి.