ప్రస్తుత కాలంలో చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరక ప్రతి ఒక్కరికీ తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి. ఒకప్పుడు మాత్రం 40,50 ఏండ్లున్న వారికి మాత్రమే వచ్చేవి. తెల్ల వెంట్రుకలు రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. జెనెటిక్స్, పర్యావరణం, జీవనశైలి వంటి చాలా కారణాల వల్ల చాలా మందికి చిన్న వయస్సులోనే గ్రే హెయిర్ రావడం ప్రారంభమవుతుంది. అయితే తెల్ల వెంట్రుకలను కనిపించకుండా చేయడానికి మార్కెట్ లోకి ఎన్నో ప్రొడక్ట్స్ వస్తున్నాయి. వీటిని యూజ్ చేసినా.. వారంలోపల మళ్లీ వెంట్రుకలు తెల్లగా అవుతాయి. అంతేకాకుండా.. వీటిలో కెమికల్స్ కూడా ఉండే అవకాశం ఉంది. వీటిని జుట్టుకు పెడితే.. జుట్టు డ్యామేజ్ అయ్యి వెంట్రుకలు ఊడిపోయే అవకాశం ఉంది.