కూరలో కారం ఎక్కువైతే ఏం చేయాలో తెలుసా?

First Published | May 24, 2024, 1:30 PM IST

కొన్ని కొన్ని సార్లు కూరలో ఉప్పు, కారాలు ఎక్కువ అవుతుంటాయి. ఇది చాలా కామన్ విషయం. కానీ ఇలా కూరలో  కారం ఎక్కువైతే దాన్ని డస్ట్ బిన్ లోనే వేస్తుంటారు. కానీ కొన్ని చిట్కాలతో కూరలో కారాన్ని, ఉప్పును తగ్గించుకోవచ్చు. అదెలాగంటే? 

నిజంగా వంట చేయడం ఒక కళే.  వంటలు అందరూ చేస్తారు. కానీ కొందరి వంటలే టేస్టీగా అవుతాయి. అయితే వంటలో ఎంతటి ఎక్స్ పర్ట్ అయినా కొన్ని కొన్ని సార్లు పొరపాట్లు చేస్తుంటారు. అంటే ఉప్పునో, కారాన్నో ఎక్కువగా వేస్తుంటారు. లేదా గ్రీవీ మరీ పల్చగా అవుతుంటుంది. ఇలాంటి కూరలను చాలా మటుకు డస్ట్ బిన్ లోనే వేసేస్తుంటారు. ఎందుకంటే ఇవి తినలేమని. కానీ కొన్ని సింపుల్ సింపుల్ టిప్స్ తో కూరలో ఉప్పు, కారాలను తక్కువ చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 


పెరుగు

పెరుగుతో వంటలో ఎన్నో ప్రయోగాలు చేయొచ్చు. మీరు చేసిన ఆహారం మరీ కారంగా అయితే టెన్షన్ అస్సలు పడకుండా. కూల్ గా ఉండి అందులో కొన్ని నీళ్లు కలపండి. అయినా కారం తగ్గకుంటే మాత్రం పెరుగును కలపండి. అయినా స్పైసీ తగ్గకపోతే టేస్ట్ మారకుండా కొద్దిగా పెరుగును కలుపుకుంటే కారం చాలా వరకు తగ్గుతుంది. 

Latest Videos


నిమ్మరసం

మీ కూర లేదా గ్రేవీ కారం కారంగా ఉన్నట్టైతే అందులో కొద్దిగా నిమ్మరసం కలపండి. ఇది కారాన్ని తగ్గిస్తుంది. అలాగే బియ్యప్పిండి లేదా శనగపిండిని కొద్దిగా నీటిలో కలిపి ఉడకబెట్టిన పులుసులో కలుపుకుంటే అదనపు మసాలా దినుసుల ఘాటు తగ్గుతుంది. 

vegetables

కూరగాయలు 

వండిన ఆహారంలో కారం మరీ ఎక్కువైనట్టైతే దాన్ని తగ్గించడానికి క్యారెట్, ఉల్లిపాయ, టొమాటో వంటి కూరగాయలను కట్ చేసి కూరలో వేసుకుంటే కర్రీ తక్కువ స్పైసీగా ఉంటుంది. టేస్టీగా కూడా ఉంటుంది.
 

peanut butter

వేరుశెనగ పేస్ట్

కారం, సాంబార్, మటన్ గ్రేవీ, చికెన్ గ్రేవీ వంటి స్పైసీ ఫుడ్స్ లో కారం ఎక్కువైతే  పీనట్స్ ను పేస్ట్ లా గ్రైండ్ చేసి  కూరలో వేయండి. ఇది ఆల్కలీనిటీని తగ్గిస్తుంది. కావాలనుకుంటే మీరు వేరుశెనగలకు బదులుగా జీడిపప్పును వేయొచ్చు. 

tomato ketchup

చక్కెర లేదా కెచప్

మీరు చికెన్ గ్రేవీ, పనీర్ బటర్ మసాలాతో పాటుగా వివిధ కూరలు చేస్తే.. అది ఎక్కువ స్పైసీగా మారితే గ్రేవీకి కొద్దిగా చక్కెర లేదా కెచప్ జోడించండి. ఇది ఆహారంలోని క్షారగుణాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. 
 

click me!