అంబానీ ఫ్యామిలీ గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు. వారికి ఉన్న సంపద అంతా ఇంతా కాదు. రీసెంట్ గా ముకేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు చాలా గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ లో నీతా అంబానీ, ఇషా అంబానీ ధరించిన జ్యూవెలరీ ధర విని అందరూషాకయ్యారు. వందల కోట్ల రూపాయల విలువ చేసే జ్యూవెలరీ ధరించి టాక్ ఆఫ్ ది కంట్రీగా మారారు. అయితే.. ఇప్పుడు... ఈ అంబానీ ఫ్యామిలీతో బాలీవుడ్ హాట్ బ్యూటీ ప్రియాంక చోప్రా పోటీ పడుతోంది.
రీసెంట్ గా ప్రియాంక చోప్రా ఓ ఈవెంట్ కోసం డైమండ్ నక్లెస్ ధరించగా.. దాని ధర విని అందరూ షాకౌతున్నారు. నీతా అంబానీ, ఇషా అంబానీ జ్యూవెలరీ ధరతో పోటీ పడేలా ఈ డైమండ్ నక్లెస్ ధర పలకడం గమనార్హం.
రోమ్‌లో జరిగిన బల్గారీ డైమండ్ జ్యువెలరీ ఈవెంట్‌లో నటి ప్రియాంక చోప్రా తన పొట్టి జుట్టు , ఖరీదైన డైమండ్ నెక్లెస్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె ధరించిన 140 క్యారెట్ల డైమండ్ నక్లెస్ ఫోటోలు, ధాని ధర ప్రస్తుతం నెట్టంట వైరల్ గా మారాయి.
ప్రియాంక చోప్రా ధరించిన బల్గారీ సెర్పెంటి ఎటర్నా నెక్లెస్ తయారీకి 2,800 గంటలు పట్టిందని దాని తయారీ సంస్థ బల్గారి తెలిపింది. వోగ్ ప్రకారం, ఈ 140 క్యారెట్ల డైమండ్ నెక్లెస్ విలువ 43 మిలియన్ డాలర్లు, అంటే భారత రూపాయల్లో 350 కోట్లు.
అయితే.. ఇక్కడ అసలు విషయం ఏమిటంటే.. ప్రియాంక ఆ నక్లెస్ కొనుగోలు చేయలేదట. బల్గారి ఆభరణాలకు ప్రపంచ బ్రాండ్ అంబాసిడర్ గా ఆమె దానిని ధరించడం విశేషం.