కాకరకాయ కూర చేదు కావొద్దంటే ఏం చేయాలో తెలుసా?

First Published May 8, 2024, 1:15 PM IST

కాకరకాయ చేదుగా ఉంటుంది. అందుకే చాలా మంది ఈ కూరను తినడానికి ఇష్టపడరు. కానీ కొన్ని ట్రిక్స్ తో కాకరకాయ చేదును ఇట్టే పోగొట్టొచ్చు. ఇందుకోసం ఏం చేయాలంటే?
 

bitter gourd

కాకరకాయలోని చేదును తొలగించడానికి ముందుగా కాకరకాయపై ఉండే గరుకు భాగాన్ని తీసేయండి. ఇలా చేయడం వల్ల కాకరకాయ చేదు చాలా వరకు తగ్గుతుంది. ఇలా కాకరకాయ తొక్కను తీసేసి కూర చేస్తే కూర అంత చేదుగా అనిపించదు. 

ఉప్పు-పసుపు నీరు 

ఉప్పు, పసుపు నీటి సహాయంతో కూడా మీరు కాకరకాయ చేదును పోగొట్టొచ్చు. ఇందుకోసం కాకరకాయను ఉప్పు-పసుపు నీటిలో రాసేపు మరిగించండి. ఈ తర్వాత కూరను చేయండి. ఈ పద్దతి కాకరకాయ కూరలో దాని చేదును చూపించదు.
 

ఉప్పు నీటిలో నానబెట్టండి 

కాకరకాయ చేదును తగ్గించుకోవాలంటే కాకరకాయలను సన్నగా కట్ చేసి ఉప్పునీటిలో వేయండి. సుమారు 1 గంట తర్వాత ఈ కాకరకాయ ముక్కలను తీసి నీరు లేకుండా పిండుకోండి. ఇప్పుడు మీకు కావాల్సినట్టు కూరను వండుకోండి. దీనివల్ల కాకరకాయ చేదు అస్సలు తెలియదు. 
 

పెరుగు 

కాకరకాయ చేదును తగ్గించడానికి  మీరు కాకరకాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి. వీటిని పెరుగులో కాసేపు వేయండి. ఒక గంట తర్వాత బయటకు తీసి శుభ్రంగా కడిగేసి కూరను తయారుచేసుకోండి. 
 

ఉప్పు వేసి వదిలేయండి

కాకరకాయ చేదును తగ్గించడానికి ఉప్పు కూడా చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం కొన్ని నీళ్లలో ఉప్పు వేసి అందులో కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు వేసి గంట పాటు వదిలేయండి. ఆ తర్వాత వీటిని కడిగి నీళ్లు లేకుండా బాగా పిండుకోండి. తర్వాత కూరను తయారుచేయొచ్చు. 
 

జాగ్రత్త 

కాకరకాయ మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. అయినప్పటికీ పొట్టకు సంబంధించిన సమస్యలు మీకు ఉంటే మాత్రం దీన్ని తినడం మానేయడమే బెటర్. ఇది మీకు మరింత అసౌకర్యాన్ని కలిగిస్తుంది. అలాగే కాకరకాయ కూరను పాలతో చేసిన ఆహారాలతో అస్సలు తినకూడదు.

click me!