వంటింట్లోకి చీమలు రావొద్దంటే ఏం చేయాలి?

First Published Apr 2, 2024, 11:18 AM IST

వంటింట్లోకి చీమలు కుప్పలు కుప్పలుగా వస్తుంటాయి. పాలు, అన్నం, కూరలకు పడుతుంటాయి. వీటిని ఎలా పోగొట్టాలో చాలా మందికి తెలియదు. అయితే కొన్ని సింపుల్ ట్రిక్స్ తో మీ వంటింట్లోకి ఒక్క చీమ కూడా రాకుండా చేయొచ్చు. అదెలాగంటే? 

అబ్బా.. పాడు చీమలు, ఇన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయని ఆడవాళ్లకు తెగ కోపం వస్తుంది. చాలా మంది వంటగదిలోకి చీమలు బారులు తీరుతాయి. ఏదో ఒక దగ్గర రంధ్రం చేసి వంటింట్లో ఉండే చక్కెర, బెల్లం, తేనె వంటి తీపి పదార్థాలకు పడుతుంటాయి. అసలు అక్కడ తీపి పదార్థాలు ఉన్నట్టు ఈ చీమలకు ఎలా తెలిసిపోతుందని అనుకుంటుంటారు. ఏదేమైనా ఈ చీమలను బయటకు పంపడం చాలా కష్టం. చీమలు రాకుండా ఉండేందు ఏం చేయాలా? అని తెగ ఆలోచిస్తుంటారు. అయితే మీరు కొన్ని సింపుల్ ట్రిక్స్ తో చీమలు రాకుండా జాగ్రత్త పడొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

పంచదార

పంచదారకు సందు లేకుండా చీమలు పడతాయి. మరి దీనితో చీమలను ఎలా తరిమికొట్టగలం అని చాలా మంది డౌట్ వస్తుంది. కానీ చక్కెరతో చాలా సులువుగా వంటింట్లో ఒక్క చీమ లేకుండా చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

Latest Videos


కావాల్సిన పదార్థాలు: బోరాక్స్ పౌడర్,  చక్కెర పొడి,  వాటర్

ఎలా తయారుచేయాలంటే: 1 కప్పు నీళ్లను తీసుకుని అందులో 1 టీస్పూన్ బోరాక్స్ పౌడర్, 2 టీస్పూన్ల చక్కెరను వేసి బాగా కలపండి. దీనిలో కాటన్ బాల్ ను  వేయండి. దీన్ని ఒక ప్లేట్ లో పెట్టండి. మీరు ఈ ప్లేట్ ను ఎక్కడ పెట్టినా చీమలన్నీ  ఆ ప్లేట్ లోకి వస్తాయి. కానీ దీనివల్ల చీమలు చనిపోతాయి. అలాగే మీ వంటింట్లో ఒక్క చీమ కూడా ఉండదు. 
 

సబ్బు నీళ్లు

చీమలను వదిలించుకోవడానికి సబ్బు నీరు కూడా బాగా ఉపయోగపడుతుంది. దీన్ని తయారుచేయాలంటే నీళ్లలో సబ్బును నీళ్లలో బాగా కలపండి. ఈ నీటిలో ఒక క్లాత్ ను నానబెట్టండి. తర్వాత ఈ తడి గుడ్డతో ఫుడ్ కంటైనర్, కిచెన్ కౌంటర్ ను తుడవండి. సబ్బు నీటిని ఉపయోగించడం వల్ల చీమలు నేల, గోడలపైకి రావు. 
 

Turmeric Powder

పసుపు 

మీ వంటగదిలో ఎర్ర చీమలు ఉన్నట్టైతే వాటిని మీరు చాలా సులువుగా పసుపుతో తరిమికొట్టొచ్చు. పసుపులో ఎన్నో సహజ ఔషదగుణాలు ఉంటాయి. దీన్ని చీమలపై చల్లితే ఒక్కటి లేకుండా పారిపోతాయి. దీని కోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. చీమలు ఉన్న చోట లేదా అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకుని అక్కడ పసుపు చల్లితే చాలు. నీళ్లలో పసుపు కలిపి చల్లితే చీమల్నీ చనిపోతాయి. 
 

వెనిగర్ వాడండి

మీ వంటింట్లోకి చీమలు వస్తున్నట్టైతే వెనిగర్ ను ఉపయోగించి వాటిని తరిమికొట్టండి. దీని కోసం స్ప్రే బాటిల్ తీసుకోండి. ఈ బాటిల్ లో వెనిగర్, నీళ్లు పోసి కలపండి. చీమలు ఉన్న చోట దీన్ని స్ప్రే చేస్తే చాలు. ఒక్క చీమ కూడా ఉండదు. అలాగే అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో అక్కడ కొట్టండి. 

వంటగదిని రోజూ శుభ్రం చేయాలా? 

చీమల నుంచి వంటగదిని రక్షించడానికి క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. ఒక్క కిచెన్ స్లాబ్ మాత్రమే కాదు, వంటగదిలో ఉంచే ప్రతి వస్తువును క్లీన్ చేయాలి. సింక్ లో ఎక్కువ పాన్ లు, పాత్రలు పేరుకుపోకుండా చూసుకోవాలి. 
 

click me!