ఆడవాళ్లు తమ ముఖ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. పసుపు పెట్టడం, ముల్తానీ మట్టితో పాటుగా బయట దొరికే క్రీమ్స్ ను కూడా వాడుతుంటారు. ఏదేమైనా మారుతున్న వాతావరణం, కాలుష్యం కారణంగా ముఖం చర్మంలో చాలా మార్పులు వస్తాయి. స్కిన్ సమస్యలు కూడా వస్తాయి. అయితే ఇలాంటి సమస్యలేం రాకుండా ఉండటానికి మీరు నెయ్యిని పెట్టొచ్చు. అవును ఇంట్లోనే దేశీ రెసిపీని తయారుచేసిన ముఖానికి అప్లై చేస్తే మీ ముఖం అందంగా మెరిసిపోతుంది. అసలు నెయ్యి మన ముఖానికి ఎలాంటి మేలు చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
సహజంగా మెరవడం
నెయ్యిని ముఖానికి రాసుకోవడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ చిట్లిపోతాయి. దీంతో మీ చర్మం సహజంగా మెరుస్తుంది. అక్కడక్కడ నలుపుదనం కూడా పోతుంది. నెయ్యి మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది
ముఖానికి నెయ్యిని అప్లై చేయడం వల్ల చర్మంలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. దీనివల్ల చర్మం యవ్వనంగా, ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ఇది మీ ముఖాన్ని గ్లో చేస్తుంది.
చర్మం కాంతివంతంగా మారుతుంది
దేశీ నెయ్యిని ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మం అందంగా మెరిసిపోతుంది. ఇది కెమికల్స్ ప్రొడక్ట్స్ మాదిరిగా ముఖ చర్మానికి ఎలాంటి హాని కలిగించదు. దీనివల్ల ఎలాంటి కొత్త చర్మ సమస్యలు రావు.
చర్మాన్ని మృదువుగా మార్చుతుంది
ముఖ చర్మాన్ని మృదువుగా మార్చడానికి నెయ్యి ఎంతగానో సహాయపడుతుంది. నెయ్యిని ఉపయోగించడం వల్ల చర్మం పొడిబారే సమస్య పూర్తిగా పోతుంది. అంతేకాదు ఇది ముఖంపై ఉండే మచ్చలను కూడా పోగొడుతుంది.
ముఖానికి నెయ్యిని ఎలా అప్లై చేయాలి?
ముఖానికి నెయ్యిని రాసుకోవాలంటే ముందుగా నెయ్యిని గోరువెచ్చగా చేయండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత అందులో చిటికెడు కుంకుమ పువ్వును వేసి కలపండి. కుంకుమపువ్వు, నెయ్యి కలిపిన తర్వాత 4 చుక్కల నెయ్యిని ముఖానికి అప్లై చేయండి. దీన్ని తేలికపాటి చేతులతో 5 నిమిషాల పాటు మసాజ్ చేయండి. రాత్రి పూట ముఖానికి నెయ్యిని అప్లై చేసుకోవడం మంచిది. దీనివల్ల చర్మం ఆరోగ్యంగా, అందంగా మారుతుంది.