బియ్యంతో ఇడ్లీని ఎలా తయారుచేయాలో తెలుసా?

First Published | May 16, 2024, 4:50 PM IST

ఇడ్లీని కేవలం ఇడ్లీ రవ్వతోనే చేస్తారని చాలా మంది అనుకుంటారు. కానీ ఇడ్లీని బియ్యంతో కూడా చేయొచ్చు. అవును బియ్యంతో చేసిన ఇడ్లీలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. బియ్యంతో ఇడ్లీని ఎలా తయారుచేయాలో తెలుసా? 


ఇడ్లీ ఆరోగ్యకరమైన ఆహారం. ఇది చాలా తొందరగా జీర్ణం అవుతుంది. దీనిలో ఆయిల్ ఉండదు. అందుకే చాలా మంది మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీనే ఎక్కువగా తింటుంటారు. ఇడ్లీని మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ గా, మధ్యాహ్నం లంచ్ గా కూడా తినొచ్చు. అయితే ఇంట్లో ఇడ్లీ రవ్వ లేనప్పుడు బియ్యంతో కూడా ఇడ్లీలను వేసుకోవచ్చు. అవును బియ్యంతో ఇడ్లీలను తయారుచేయడం చాలా ఈజీ. ఇవి టేస్టీ టేస్టీగా కూడా ఉంటాయి. ఇంతకీ బియ్యంతో ఇడ్లీని ఎలా తయారుచేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

కావాల్సిన పదార్థాలు
బియ్యం - 2 కప్పులు
మినప్పప్పు - 1 కప్పు
జీలకర్ర - 1 టీ స్పూను
నూనె లేదా నెయ్యి - 1 టీస్పూన్
ఉప్పు - రుచికి తగ్గట్టుగా
బేకింగ్ సోడా - చిటికెడు

Latest Videos


మీరు బియ్యంతో ఇడ్లీలను తయారుచేయాలనుకుంటే ఒక రోజు ముందు బియ్యంలో మినప్పప్పు, మెంతులను కలిపి నీళ్లు పోసి బాగా కడగండి. దీన్ని 5 నుంచి 6 గంటల పాటు నానబెట్టండి. 5-6 గంటల తర్వాత ఈ మిశ్రమంలోని నీటిని తీసి మిక్సీ గ్రైండర్ లో గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని కాస్త గరుకుగా పట్టి రాత్రంతా పులియబెట్టండి. 

మరుసటి రోజు ఉదయం వరకు ఈ మిశ్రమం బాగా పులుస్తుంది. ఇడ్లీలను వేయడానికి ముందు దానిలో కొన్ని నీళ్లు పోసి బాగా కలపండి. దీన్ని మరీ లూస్ గా చేయకండి. ఎందుకంటే ఇడ్లీలు సరిగ్గా రావు. ఇప్పుడు మిశ్రమంలో ఉప్పు, బేకింగ్ సోడాను వేసి కలిపి ఇడ్లీ స్టాండ్ కు నూనె లేదా నెయ్యి రాసి ఇడ్లీలను వేయండి. ఇంకేముంది వేడివేడి స్పాంజి ఇడ్లీ రెడీ. ఈ ఇడ్లీను కొబ్బరి చట్నీ, వేరుశెనగ పచ్చడి, సాంబార్ తో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అదుర్స్. 


చిట్కాలు-

అన్నంతో ఇడ్లీ తయారు చేయడమే కాకుండా రవ్వ, పెరుగుతో ఇన్ స్టంట్ ఇడ్లీని కూడా మీరు తయారుచేసుకోవచ్చు. వీటితో ఇడ్లీని తయారుచేయడం చాలా ఈజీ కూడా. 
 

click me!