బర్త్ డే పార్టీలు, డిన్నర్ పార్టీలు, కిట్టీ పార్టీలతో సహా ఇండ్లలో పూజలు ఇతరత్రా పార్టీలు జరుగుతూనే ఉంటాయి. చుట్టాల రాకతో ఇళ్లు సందడిగా మారుతుంది. అలాగే వారికోసం రకరకాల వంటలు చేస్తుంటారు. వంటలు చేయడం ఈజీనే. కానీ వంటతో వంటిళ్లు, గిన్నెలు జిడ్డు జిడ్డుగా మారుతాయి. వీటిని శుభ్రం చేయడానికి ఆడవాళ్లకు చాలా సమయం పడుతుంది. వంటగదిని శుభ్రం చేసినా సింక్ లో వేసిన గిన్నెలను మాత్రం క్లీన్ చేయాలంటే పెద్ద తలనొప్పే. కొంతమంది ఆడవారు ఈ గిన్నెలను చూసి కోపంతో ఏడుస్తుంటారు కూడా. ఈ గిన్నెలను క్లీన్ చేయడం, వాటి అడుగు భాగంలో పేరుకున్న జిడ్డు, మాడు మొండి మరకలను పోగొట్టడం అందరికీ కష్టమే. కానీ చాలా మంది ఏదో మీద మీద మాత్రమే క్లీన్ చేస్తుంటారు. కానీ దీనివల్ల వంట చేయడం వల్ల దానిపై జిడ్డు పేరుకుపోయి గిన్నెలు మురికిగా కనిపస్తాయి. ఇలాంటి జిడ్డు అంత సులువుగా పోదు.
ఇలాంటి జిగట, మొండి మరకలున్న పాత్రలు ప్రతి ఒక్కరి ఇంట్లో ఖచ్చితంగాఉంటాయి. ఈ పాత్రలను శుభ్రం చేయడానికి మీరు సాధారణ డిష్ వాష్ జెల్ లేదా బార్లను ఉపయోగిస్తే మాత్రం పోదు. కానీ ఒక సింపుల్ చిట్కాతో మాత్రం ఈ మొండి జిడ్డు మరకలను పోగొట్టొచ్చు. దీనికోసం మీరు రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. దీన్ని చాలా మంది పనికిరానిదిగా తీసేస్తారు కూడా. కానీ అదే వ్యర్థ వస్తువు మీ పాత్రలను తలతల మెరిసేలా చేస్తుంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
బియ్యం నీటితో పాత్రలను ఎలా శుభ్రం చేయాలి?
కావాల్సిన పదార్థాలు: బియ్యం నీరు, స్క్రబ్బర్, డిష్ వాష్ జెల్ లేదా బార్, ఉప్పు
పాత్రల జిడ్డును ఎలా తొలగించాలి?
ముందుగా బియ్యాన్ని కడిగిన నీటిని పారేయకుండా ఒక టబ్ లో నిల్వ చేయండి. బియ్యం నీరు ఎక్కువగా నిల్వ ఉన్నప్పుడు అందులో జిగట, నూనె పాత్రలను అరగంట పాటు నానబెట్టండి. అరగంట తర్వాత పాత్రల స్నిగ్ధత, నూనె నీటిలో బాగా కలిసిపోతాయి.
ఇది కాకుండా నీటిలో ఎక్కువ సేపు నానబెట్టడం వల్ల పేరుకుపోయిన మురికి కూడా మృదువుగా మారుతుంది. దీనిని మీరు స్క్రబ్బర్ తో ఈజీగా శుభ్రం చేసుకోవచ్చు. రైస్ వాటర్ నుంచి గిన్నెలను బయటకు తీసి డిష్ వాష్ బార్ తో రుద్దండి. మురికి మరీ మొండిగా ఉంటే ఉప్పు వేసి రుద్దండి. ముతక ఉప్పు గ్రీజు, కాలిపోయిన మురికిని శుభ్రపరుస్తుంది. ఇప్పుడు శుభ్రమైన నీటితో పాత్రలను కడిగి కాటన్ బట్టతో తుడవండి. దీనివల్ల పాత్రల జిడ్డు, మురికి రెండూ సులభంగా తొలగిపోతాయి.