ఇంట్లోనే హ్యాండ్ వాష్ ఎలా తయారు చేయాలో తెలుసా?

First Published Apr 23, 2024, 5:03 PM IST

హ్యాండ్ వాష్ తయారు చేయడానికి మీరు పెద్ద పెద్ద తిప్పలు ఏమీ పడాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్ వస్తువులతో తయారు చేయవచ్చు. దాదాపు ఇంట్లో ఉండే వస్తువులతోనే తయారు చేసేయవచ్చు.

ప్రతి ఒక్కరి ఇంట్లో హ్యాండ్ వాష్ ఉంటుంది. గతంలో వాడని వారు అయినా.. కరోనా తర్వాత  ఈ హ్యాండ్ వాష్ లను విపరీతంగా వాడటం మొదలుపెట్టారు. కరోనా భయంతో.. రోజుకి పదిసార్లు అయినా హ్యాండ్ వాష్ తో చేతులు కడిగేవారు ఉన్నారు అనడంలో అతిశయోక్తి లేదు. అయితే..  ఈ హ్యాండ్ వాష్ ధర కూడా మాములగా ఉండటం లేదు. ప్రతిసారీ కొనాలంటే కూడా ఖర్చే. అయితే...  దీనిని ఇంట్లోనే కేవలం పది రూపాయల ఖర్చుతో  తయారు చేసుకోవచ్చు తెలుసా? ఇలా తయారు చేయాలో ఓసారి చూద్దాం...

hand wash

హ్యాండ్ వాష్ తయారు చేయడానికి మీరు పెద్ద పెద్ద తిప్పలు ఏమీ పడాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్ వస్తువులతో తయారు చేయవచ్చు. దాదాపు ఇంట్లో ఉండే వస్తువులతోనే తయారు చేసేయవచ్చు.

కేవలం 10 రూపాయలకే నేచురల్ హ్యాండ్ వాష్ చేయడానికి కావలసిన పదార్థాలు
ఒక పెద్ద కప్పు నీరు
రెండు టేబుల్ స్పూన్లు షాంపూ
ఒక చెంచా అలోవెరా జెల్
అర టీస్పూన్ వేప నూనె
ఒక చెంచా ఆలివ్ నూనె
ఒక చిన్న చెంచా ఉప్పు
 సబ్బు బార్
ఒక ఖాళీ సీసా

ఫుడ్ ప్రాసెసర్, కత్తి లేదా తురుము పీటను ఉపయోగించి, 10 రూపాయల సబ్బును తురుముకోవాలి లేదా మెత్తగా కోయాలి.
ఒక సాస్పాన్లో నీరు పోసి మరిగించండి.దీని తరువాత, మంటను ఆపివేసి, సబ్బు ముక్కను నీటిలో ఉంచండి. సబ్బు నీటిలో కరిగిపోయే వరకు ద్రావణాన్ని నిరంతరం కలుపుతూ ఉండాలి.  సువాసన కోసం గులాబీ రేకులను కూడా దీనికి జోడించవచ్చు.దాంట్లోనే పైన చెప్పిన షాంపూ, ఆలివ్ నూనె, వేప నూనె ఉప్పు కూడా వేసి కలపాలి. తర్వాత  మిశ్రమాన్ని కనీసం 15 నిమిషాలు చల్లబరచండి. అంతే..హ్యాండ్ వాష్ డబ్బాలో దీనిని వేసి వాడుకోవడమే..
 

click me!