మొటిమల సమస్యతో బాధపడుతున్నారా..? ఇదిగో పరిష్కారం..!

First Published Apr 23, 2024, 4:23 PM IST

మార్కెట్ లో  దొరికే ఏవేవో క్రీములు రాస్తూ ఉంటారు. అయినా.. పెద్దగా పరిష్కారం దొరకదు. అయితే... అలాంటి సమస్యతో బాధపడుతున్నవారు ఒక్క చిన్న హోం రెమిడీతో ఈ సమస్యను పరిష్కరించవచ్చు

acne

టీనేజీ వయసు దాటిన దగ్గర నుంచి పిల్లలకు మొటిమల సమస్య మొదలౌతూ ఉంటుంది.  ఆ మొటిమలు పెద్ద అవుతున్న కొద్దీ పెరుగుతూనే ఉంటాయి. వాటిని ఎలా తగ్గించుకోవాలే తెలీక చాలా సతమతమౌతూ ఉంటారు. మార్కెట్ లో  దొరికే ఏవేవో క్రీములు రాస్తూ ఉంటారు. అయినా.. పెద్దగా పరిష్కారం దొరకదు. అయితే... అలాంటి సమస్యతో బాధపడుతున్నవారు ఒక్క చిన్న హోం రెమిడీతో ఈ సమస్యను పరిష్కరించవచ్చు.

acne

చాలా మంది స్మూత్ స్కిన్ పొందడానికి రకరకాల చిట్కాలు పాటిస్తారు. మీరు మీ చర్మాన్ని పద్దతిగా మృదువుగా చేయాలనుకుంటే తేనె ఉత్తమ ఎంపిక. దీర్ఘకాలంలో చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సరే ఇప్పుడు ముఖానికి తేనెను ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇక్కడ చూద్దాం.

మొటిమలను నివారిస్తుంది: తేనె మొటిమలను నివారిస్తుంది. ఇందులో ఉండే యాంటీమైక్రోబయల్ గుణాలు వ్యాధికారక క్రిములు చర్మంలోకి ప్రవేశించకుండా నిరోధిస్తాయి. కాబట్టి, మొటిమలు ఉన్నవారు దీనిని ఉపయోగించవచ్చు.
 


ముఖాన్ని తేమగా ఉంచుతుంది: తేనెను ముఖానికి అప్లై చేయడం వల్ల మొటిమలతో పోరాడటమే కాకుండా చర్మాన్ని తేమగా ఉంచుతుంది. కాబట్టి, మీరు మీ చర్మాన్ని పునరుజ్జీవింపజేయాలనుకుంటే ఖచ్చితంగా దీన్ని ఉపయోగించండి.

ముఖం ముడుతలను తొలగిస్తుంది: మీ ముఖంపై తేనెను అప్లై చేయడం వల్ల ముఖం ముడతలు, ఫైన్ లైన్లు , చర్మం వృద్ధాప్య సంకేతాలు తగ్గుతాయి. UV కిరణాల వల్ల కలిగే ఆక్సీకరణ నష్టం , పరమాణు నష్టం నుండి తేనె చర్మాన్ని రక్షిస్తుంది.

ఆరోగ్యకరమైన చర్మం: ఆరోగ్యకరమైన చర్మాన్ని పొందడానికి తేనె గొప్ప మార్గం. యాంటీఆక్సిడెంట్ , యాంటీఏజింగ్ లక్షణాలతో, ఇది చర్మం దెబ్బతినకుండా చేస్తుంది.
 


రెగ్యులర్ గా ముఖనికి తేమ అప్లై చేస్తూ ఉండటం వల్ల ఆ ముఖంపై మొటిమలు తగ్గిపోయి.. చర్మం మృదువుగా మారుతుంది. ప్రయత్నించి చూడండి. 

click me!