పొడవాటి, మందపాటి జుట్టు కావాలని కోరుకోనివారు ఎవరైనా ఉంటారా? ముఖ్యంగా అమ్మాయిలకు ఒత్తైన, పొడవైన జుట్టు పొందాలని అనుకుంటారు. కానీ.. ఈ రోజుల్లో అది సాధ్యం కావడం కష్టం అవుతోంది. కెమికల్స్ ఉన్న ఉత్పత్తులు వాడటం, సరైన ఆహారం తీసుకోకపోవడం, కాలుష్యం ఇలా పలు కారణాల వల్ల జుట్టు విపరీతంగా రాలిపోయి.. ఎలుక తోకలా మారిపోతుంది. మళ్లీ జుట్టు ఒత్తుగా పెరగాలంటే.. మార్కెట్లో దొరికే ఖరీదైన సీరమ్స్ వాడుతూ ఉంటారు. కానీ, వాటి అవసరం లేకుండా కూడా జుట్టును బలంగా మార్చుకోవచ్చు. అది కూడా ఇంట్లో తయారు చేసుకునే ఒక హెయిర్ ప్యాక్ తో. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం...