అమ్మాయిలకు ఎప్పుడూ ఒకేలాంటి డ్రెస్ లు వేసుకోవడం పెద్దగా నచ్చదు. ఎందుకంటే.. మార్కెట్లో ఎన్నో రకాల మోడల్స్ అందుబాటులో ఉన్నాయి కాబట్టి.. ఏదో ఒక సందర్భంలో అలాంటి డ్రెస్ లు వేసుకోవాలని ఆశపడతారు. వాటిల్లో స్లీవ్ లెస్ కూడా ఒకటి.
అయితే.. స్లీవ్ లెస్ డ్రెస్ వేసుకోవాలంటే.. ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టే సమస్య అండర్ ఆర్మ్స్. శరీరమంతా తెల్లగా మెరిసిపోయినా.. అండర్ ఆర్మ్స్ మాత్రం.. నల్లగా ఉండి వేధిస్తూ ఉంటాయి. అలా కనపడుతున్నప్పుడు.. స్లీవ్ లెస్ వేసుకోలేరు.
చాలా మంది ఈ అండర్ ఆర్మ్స్ సమస్యను పరిష్కరించుకోవడానికి వేల రూపాయలు ధారబోసి క్రీములు కొని వాడుతుంటారు. అయినా పెద్దగా ఫలితం కనపడదు. అయితే.. మన వంటింట్లో లభించే ఒక కూరగాయతో ఈ సమస్యను సులభంగా పరిష్కరించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..
ఆలుగడ్డ.. ఇది అండర్ ఆర్మ్స్ తెల్లగా చేయడానికి సహాయం చేస్తుందట. దీనిలో కొద్దిగా బ్లీచింగ్ ప్రాపర్టీస్ ఉంటాయట. దీనిని వాడటం వల్ల.. నల్లటి మచ్చలు తగ్గి.. చర్మం సాధారణ రంగుకి మారేలా సహకరిస్తుందట. దీనిలో విటమిన్ సీ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని నియంత్రిస్తుంది. చర్మం మృదువుగా ఉండేలా.. సాగిపోకుండా ఉండేలా సహకరిస్తుంది.
మరి దీనిని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం..
బంగాళదుంప(ఆలుగడ్డ) సహజ బ్లీచింగ్ లక్షణాలు కలిగి ఉంటుంది. ఈ లక్షణమే అండర్ ఆర్మ్స్ లోని నలుపును తగ్గిస్తుంది. దురద సమస్యను కూడా ఇది తగ్గిస్తుంది.
బంగాళ దుంప ముక్కని లేదా.. రసాన్ని.. అండర్ ఆర్మ్స్ కి అప్లై చేయాలి. పది 15నిమిషాలపాటు దానిని అలా వదిలేయాలి. ఆ తర్వాత దానిని నీటితో శుభ్రం చేసుకోవాలి. దీనిని ప్రతిరోజూ చేయడం వల్ల నలుపు పోయి.. అండర్ ఆర్మ్స్ సమస్య లేకుండా పోతుంది.
బంగాళదుంప రసం మచ్చలను తొలగించడానికి సహాయపడుతుంది. దీని రసం తీసి.. ఆ రసాన్ని కాటన్ లో ముంచి... మచ్చలు ఉన్న ప్రాంతాల్లో రాస్తే సరిపోతుంది. ఇలా వరసగా కొద్ది రోజులు చేయడం వల్ల ఫలితం మీకే స్పష్టంగా కనపడుతుంది.