శరీరం సన్నగా, బుగ్గలు లావుగా ఉంటే అస్సలు అందంగా కనిపించదు. బుగ్గలు మరీ ఎక్కువ లావుగా ఉంటే కూడా ఎవ్వరూ ఇష్టపడరు. ఎందుకంటే బుగ్గలు లావుగా ఉంటే మీరు ఎంత అందంగా ఉన్నా ఇది మీ అందాన్ని పాడుచేస్తుంది. బుగ్గలను తగ్గించుకోవాలనుకుంటే మీరు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
కార్డియో వ్యాయామాలు
కార్డియో వ్యాయామాలతో సులువుగా బరువు తగ్గొచ్చు. అలాగే లావుగా ఉన్న బుగ్గలను కూడా ఈ వ్యాయామాలతో సులువుగా తగ్గించుకోచ్చు. రోజూ కార్డియో వ్యాయామాలు చేయడం వల్ల చెంపలకున్న కొవ్వును తగ్గించుకోవచ్చు. కార్డియో వ్యాయామాలు చాలా తక్కువ సమయంలోనే ముఖ కొవ్వును తగ్గిస్తాయి.
ముఖ వ్యాయామాలు
ముఖ వ్యాయామాలు కూడా లావుగా ఉన్న బుగ్గలను సగ్గంగా చేస్తాయి. ముఖ వ్యాయామాలు ముఖ కండరాలను టోన్ చేయడానికి సహాయపడతాయి. మీరు ప్రతిరోజూ కొన్ని సులభమైన ముఖ వ్యాయామాలు చేస్తే బుగ్గలు సన్నబడతాయి. ఇది ముఖ కొవ్వును తగ్గిస్తుంది.
ఫిష్ ఫేస్ ఎక్సర్ సైజ్
ఫిష్ ఫేస్ ఎక్సర్ సైజులతో కూడా మీరు లావుగా ఉన్న బుగ్గలను సన్నగా చేయొచ్చు. అలాగే డబుల్ చిన్ ను కూడా తగ్గిస్తుంది. దీనికోసం మీరు రోజూ కాసేపు ఫిష్ ఫేస్ ఎకర్సర్ సైజులు చేయండి. ఈ వ్యాయామం చేయడానికి మీరు లోతైన శ్వాస తీసుకోండి. తర్వాత బుగ్గలను లోపలికి లాగండి. లిప్స్ న ముదుకు పెట్టండి. ఈ సమయంలో పైకి చూడండి. దీన్ని రిపీట్ చేస్తూనే ఉండండి.
నీరు ఎక్కువగా తాగండి
బుగ్గలు తగ్గించుకోవాలనుకుంటే మాత్రం నీళ్లను ఎక్కువగా తాగండి. ఎందుకంటే నీళ్లను తాగితే మీ జీవక్రియ పెరుగుగుతుంది. అలాగే బుగ్గలకున్న కొవ్వు కూడా కరిగిపోతుంది. వాటర్ సహాయంతో కూడా మీరు ముఖ కొవ్వును చాలా సులువుగా తగ్గించుకోవచ్చు.
తక్కువ పిండి పదార్థాలు
శుద్ధి చేసిన పిండి పదార్థాలు రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతాయి. ఇది ముఖ కొవ్వును బాగా పెంచుతుంది. అందుకే మీరు తినే ఆహారంలో పిండి పదార్థాలు తక్కువగా ఉండేలా చూసుకోండి.
బుగ్గలను గాలితో నింపండి
బుగ్గలను గాలితో నింపి కూడా మీరు బుగ్గల సైజును తగ్గించుకోవచ్చు. ఇందుకోసం మీరు నడుము నిటారుగా పెట్టి కూర్చోండి. వీలైనంత వరకు తలను వెనక్కు వంచి ముఖాన్ని ఆకాశం వైపు ఉంచాలి. ఇప్పుడు నోరు తెరిచి గాలిని నోటి నిండా తీసుకుని తర్వాత గాలిని బయటకు వదలండి.