జుట్టును ఎక్కువగా దువ్వితే ఏం జరుగుతుందో తెలుసా?

First Published Apr 7, 2024, 2:57 PM IST

కొంతమంది జుట్టును ఒక్కటే దువ్వుతూనే ఉంటారు. జుట్టును నీట్ గా ఉంచడానికి ఇలా చేస్తుంటారు. కానీ జుట్టును పదే పదే దువ్వడం అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. జుట్టును ఎక్కువగా దువ్వితే ఏం జరుగుతుందంటే? 

చర్మ సంరక్షణ మనకు ఎంత ముఖ్యమో జుట్టు సంరక్షణ కూడా అంతే ముఖ్యం. రోజూ ముఖాన్ని ఎలా అయితే కడుగుతామో.. జుట్టును కూడా దువ్వుతుంటారు. అయితే కొంతమంది వెంట్రుకలను రోజుకు ఐదారు సార్లు దువ్వుతుంటారు. నిజానికి నెత్తిని దువ్వడం చాలా అవసరం. అలా అని ఎప్పుడూ దువ్వుతుంటే మాత్రం మీరు ఎన్నో సమస్యలను ఫేస్ చేయాల్సి వస్తుంది. అవును జుట్టును ఎక్కువగా దువ్వితే హెయిర్ ఫాల్ తో పాటుగా ఎన్నో సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. r

జుట్టుపై ప్రభావం

జుట్టును పదేపదే దువ్వడం జుట్టు ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఎందుకంటే జుట్టును రోజంతా ఐదారు సార్లు దువ్వడం వల్ల జుట్టు దెబ్బతింటుంది. దీనివల్ల మీ జుట్టు రాలే అవకాశం ఉంది. అందుకే ఇప్పటి నుంచి ఇలా దువ్వకండి.

జుట్టు బలహీనంగా ఉంటుంది.

జుట్టును ఎక్కువగా దువ్వే అలవాటు చాలా మందికే ఉంటుంది. ఇలా దువ్వడం వల్ల మీ జుట్టు నీట్ గా ఉన్నప్పటికీ.. వెంట్రుకలు మాత్రం దెబ్బతింటాయి. జుట్టును ఎక్కువగా దువ్వడం వల్ల మీ జుట్టు బలహీనంగా మారుతుంది. దీనివల్ల చిన్నగా దువ్వినా వెంట్రుకలు విపరీతంగా రాలుతాయి. ఈ కారణంగానే చాలా మందికి వెంట్రుకలు రాలుతుంటాయి. 
 

hair

జుట్టు పెరుగుదలను ప్రభావితం చేస్తుంది 

వెంట్రుకలను ఎక్కువగా దువ్వడం వల్ల జుట్టు రాలడమే కాకుండా.. జుట్టు పెరుగుదలపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది. అవును జుట్టును ఎక్కువగా దువ్వడం వల్ల జుట్టు తొందరగా పెరగదు. అంతేకాదు దీనివల్ల జుట్టు ఎక్కువగా తెగిపోతుంది కూడా. 
 

నెత్తిమీద సమస్యలు 

నెత్తిని ఎక్కువగా దువ్వడం వల్ల నెత్తి కూడా ప్రభావితం అవుతుంది. నెత్తిని ఒక్కటే దువ్వడం వల్ల నెత్తి నొప్పి పెడుతుంది. అలాగే విపరీతంగా దురద కూడా పెడుతుంది. అందుకే వెంట్రుకలను ఎక్కువగా దువ్వకూడదని నిపుణులు చెబుతుంటారు. 

జుట్టు దెబ్బతినడం

వెంట్రుకలను పదేపదే, చాలా గట్టిగా దువ్వే అలవాటు కూడా ఉంటుంది కొంతమందికి. నెత్తిలో పేళ్లు ఉండేవారే ఇలా ఎక్కువగా దువ్వుతుంటారు. కానీ ఇలా దువ్వడం వల్ల జుట్టు క్యూటికల్స్ దెబ్బతింటాయి. ఎందుకంటే వెంట్రుకల చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. దీంతో మీ జుట్టు బాగా రాలుతుంది.
 

ఎలా దువ్వాలి?

దువ్వెనతో వెంట్రుకలను చాలా సున్నితంగా దువ్వాలి.  దీంతో మీ జుట్టు షైనీగా మెరుస్తుంది. మీరుగట్టి గట్టిగా వెంట్రుకలను దువ్వినప్పుడు వెంట్రుకలు చాలా తెగిపోతాయి. మరొక ముఖ్యమైన విషయమేంటంటే.. జుట్టును అవసరమైనప్పుడు మాత్రమే దువ్వడం అలవాటు చేసుకోండి. 

రోజుకు ఎన్నిసార్లు దువ్వాలి? 

జుట్టును అవసరం ఉన్నా లేకున్నా పదేపదే దువ్వడం మానుకోండి. మీకు తెలుసా? జుట్టును రోజుకు ఒక సారి మాత్రమే దువ్వాలి. మీ జుట్టు మరింత కర్లీ లేదా దట్టంగా ఉంటే మాత్రం మీరు రోజుకు 2 సార్లు దువ్వుకోవచ్చు.

click me!