సూర్యగ్రహణం టైంలో గర్భిణులు ఏం చేయాలి? ఏం చేయకూడదు?

First Published | Apr 7, 2024, 4:41 PM IST

ఈ ఏడాది ఏప్రిల్ 8న తొలి సూర్యగ్రహణం ఏర్పడనుంది. అమావాస్య నాడు వచ్చే ఈ సూర్య గ్రహణం భారతదేశంలో కనిపించదు. ఇది ఇక్కడి ప్రజలను ప్రభావితం చేయదు.  కానీ గ్రహణం గర్భిణీ స్త్రీలపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతుందని నమ్ముతారు. అందుకే గ్రహణం టైంలో గర్భిణులు ఏం చేయాలి? ఏం చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

ఏప్రిల్ 8న ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. అయితే ఈ గ్రహణం మన దేశంలో కనిపించదు.  ఈ గ్రహణం అమెరికా, ఆసియా, ఆస్ట్రేలియా, ఇండోనేషియాలో కనిపస్తుంది. సూర్యగ్రహణం సూర్యుడికి, భూమికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు ఏర్పడుతుంది. గ్రహణం కనిపించని ప్రదేశాల్లో పెద్దగా తేడా ఏమీ ఉండదు. కానీ సూర్య చంద్రులు మొత్తం విశ్వంలో ఒకేలా ఉంటారు. కాబట్టి ఇది మొత్తం పర్యావరణంపై కొంత ప్రభావం చూపుతుందని కొందరు నమ్ముతారు. మన దేశంలో ఈ గ్రహణం కనిపించకపోయినా గర్భిణీ స్త్రీలపై ఎంతోకొంత ప్రభావాన్ని చూపుతుందని నమ్ముతారు. అందుకే గ్రహణం సమయంలో గర్భిణులు ఏం చేయాలి? ఏం చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

సూతక్ కాలంలో గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. సూతక్ కాలం కూడా చెల్లదు. కానీ గ్రహణం సమయంలో ఏ పనులు చేయకూడదు అనే దాని గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. 


సూర్యగ్రహణం నాడు గర్భిణీ స్త్రీలు ఏ పనులు చేయకూడదు?

1. సూర్యగ్రహణం రోజు గర్భిణీ స్త్రీలు ఇంటి నుంచి బయటకు రాకూడదు.

2. గ్రహనం టైంలో తినడం, వంట చేయడం నిషిద్దం. 

3. సూర్యగ్రహణం సమయంలో ఎక్కువగా శారీరక శ్రమ చేయకండి. విశ్రాంతి ఎక్కువగా తీసుకోండి.
 
4. సూర్యగ్రహణం లేదా చంద్రగ్రహణాన్ని నేరుగా కళ్లతో చూడకూడదు. 

5. గ్రహణం సమయంలో కత్తి, కత్తెర లేదా పదునైన వస్తువును ఉపయోగించకూడదు.

6. గ్రహణం సమయంలో పండ్లు, కూరగాయలు కూడా కట్ చేయకూడదు.

7. గ్రహణం టైంలో నిద్రపోవడం మంచది కాదు. కానీ విశ్రాంతి తీసుకోవచ్చు. 

సూర్యగ్రహణం తర్వాత గర్భిణులు ఏం చేయాలి?

సూర్యగ్రహణం అయిపోయిన తర్వాత స్నానపు నీటిలో గంగాజలాన్ని కలిపి స్నానం చేయాలి.

గ్రహణం సమయంలో ధరించిన దుస్తులను దానం చేయండి. ఇది తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని కాపాడుతుందని నమ్ముతారు.

Latest Videos

click me!