బాత్రూమ్ ట్యాప్ నుంచి వాటర్ సరిగా రావడం లేదా..? ఇలా సరి చేయండి..!

First Published | Apr 29, 2024, 2:30 PM IST

మనం బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా ట్యాప్ లు మాత్రం తొందరగా పాడౌతూ ఉంటాయి. వాటర్ సరిగా రాదు. దీంతో.. తరచూ ట్యాప్ లు మార్చేయాల్సి వస్తూ ఉంటుంది.  

tap water

మనం మన ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటూ ఉంటాం. ఇంటి తో  పాటు బాత్రూమ్ కూడా శుభ్రం చేస్తూ ఉంటాం. అయితే... మనం బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా ట్యాప్ లు మాత్రం తొందరగా పాడౌతూ ఉంటాయి. వాటర్ సరిగా రాదు. దీంతో.. తరచూ ట్యాప్ లు మార్చేయాల్సి వస్తూ ఉంటుంది.  లేదంటే ప్లంబర్ ని పిలిచినా కనీసం రూ.500 ఇవ్వకుండ పని జరగదు. వాళ్లని పిలిచి ఆ ట్యాప్ రిపేర్ చేపించినా, కొత్తవి  మార్చినా కూడా  సరిగా వర్కౌట్ అవుతాయా అంటే అదీ లేదు. అసలు... ఈ ప్రాబ్లం లేకుండా.. ఊరికూరికే ట్యాప్స్ మార్చే అవసరం రాకుండా... కేవలం ఐదు నిమిషాల్లో రిపేర్ అయిపోయి.. వాటర్ సరిగా రావాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం...


తరచుగా వాటర్ ట్యాప్ లో వాటర్ సరిగా రావడం లేదు అంటే.. ఆ నీటిలో  దుమ్ము,  ధూళి, మట్టి పేరుకుంటోందని అర్థం. ఎందుకంటే ట్యాప్ లోపల ఒక చిన్న మెష్ ఉంటుంది. ఇది నీటిని శుభ్రం చేస్తూ ఉంటుంది. కానీ... ఆ మెష్ లో నీటితో పాటు వచ్చే దుమ్ము ఇరుక్కుపోయి అక్కడే ఆగిపోతుంది. దీంతో.. నీరు సరిగా బయటకు రావు. అయితే... ఈ కింది చిట్కాలతో మనం ఆ సమస్యను పరిష్కరించవచ్చు.
 

Latest Videos


ఒక చిన్న సూది సహాయంతో మనం వాటర్ ట్యాప్ లను శుభ్రం చేయవచ్చు. కుళాయి నుండి నీరు నెమ్మదిగా వస్తున్నట్లయితే, మీరు దానిని సూది సహాయంతో పరిష్కరించవచ్చు. దీని కోసం మీరు మందపాటి సైజు సూదిని తీసుకోవాలి. మీరు దానిని ట్యాప్ లోపల పొడుస్తూ ఉండాలి.  ఇలా పొడవడం వల్ల.. దుమ్ము వదిలి.. నీరు ఫ్రీగా బయటకు రావడానికి  సహాయపడుతుంది.
 

సూదితో పొడవాలంటే కష్టం అనుకుంటే.. కేవలం మీరు వేడి నీటి సహాయంతో కూడా  ట్యాప్ రిపేర చేయవచ్చు. దీని కోసం, ముందుగా ఒక పాత్రలో నీటిని వేడి చేయండి. కాస్త ఎక్కువగానే వేడి చేయాలి. ఇలా వేడి చేసిన నీటిని ట్యాప్ దగ్గర ఉంచాలి. కనీసం మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు... ఆ వేడి నీటి పాత్రను ట్యాప్ కి దగ్గరగా ఉంచాలి. అలా చేయడం వల్ల కుళాయిలోని వ్యర్థాలు కరిగి నీటితో పాటు.. కిందకు వచ్చేస్తాయి. అప్పడు.. ట్యాప్ నుంచి మళ్లీ వాటర్ ఫ్రీగా బయటకు వస్తాయి. 

ఇలా కాదు అంటే... మీరు హాట్ వాటర్ బ్యాగ్ తో కూడా ప్రాబ్లం సాల్వ్ చేయవచ్చు. హాట్ వాటర్ బ్యాగ్ ని.. ట్యాప్ కి పెట్టి రాత్రంతా.. గట్టిగా మూసివేయాలి. మరుసటి రోజు.. దానిని  విప్పతీస్తే.. ట్యాప్ లో ఇరుక్కుపోయిన దుమ్ము బయటకు పోతుంది. వాటర్ ఫ్రీగా బయటకు వచ్చేస్తుంది. కావాలంటే.. ఓసారి ప్రయత్నించి చూడండి. 

click me!