అండర్ వేర్ లను సరిగ్గా ఎలా వాష్ చేయాలంటే?

First Published | Dec 13, 2023, 9:44 AM IST

లోదుస్తులను ఏదో వాష్ చేశామా అన్నట్టు చేస్తే మీరు ఎన్నో సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇన్సన్స్ వాషింగ్ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా మీరు ఎన్నో రకాల ఇన్ఫెక్షన్ల బారిన పడాల్సి వస్తుంది. దీనివల్ల యోని దురద, వాసన వంటి సమస్యలు వస్తాయి. అందుకే ఈ రోజు ఇన్నర్స్ ను సరిగ్గా వాష్ ఎలా చేయాలో తెలుసుకుందాం.. 
 

అండర్ వేర్

చాలా మంది ఆడవాళ్లు ఇన్నర్స్ ను కొనేటప్పుడు వాటి క్వాలిటీ, సౌకర్యం కంటే వాటి కలర్, డిజైన్ నే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. నార్మల్ తో పోలిస్తే ఫ్యాన్సీ లోదుస్తులే ఆడవాళ్లను ఎక్కువగా ఆకర్షిస్తాయి. బ్రా విషయంలో కూడా ఇలాగే చేస్తారు. వీటి డిజైన్ చూసి కొంటే మీరు ఎన్నో సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. అందుకే స్టైలిష్ గా ఉండటం కంటే, సౌకర్యవంతంగా ఉండటం చాలా మంచిది. ముఖ్యంగా వీటిని శుభ్రంగా ఉంచడం చాలా చాలా అవసరం. అది బ్రా అయినా సరే ప్యాంటీ అయినా సరే.. పరిశుభ్రత విషయంలో అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే ఇది యోని ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. 
 

అండర్ వేర్

యోని, దాని చుట్టుపక్కల ప్రాంతాన్ని శుభ్రంగా, పొడిగా ఉంచడానికి లోదుస్తులు పనిచేస్తాయి. శుభ్రమైన, సౌకర్యవంతమైన లోదుస్తులు ధరించడం ద్వారా అన్ని రకాల ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉంటారు. లోదుస్తుల పరిశుభ్రతను పాటించడం బ్యాక్టీరియా వల్ల వచ్చే సమస్యలు కూడా తగ్గిపోతాయి. మరీ ముఖ్యంగా శుభ్రమైన లోదుస్తులు వాసన, యోని దురద సమస్యను దూరం చేస్తాయి. మరి అండర్ వేర్ లను సరిగ్గా ఎలా శుభ్రం చేయాలో తెలుసుకుందాం పదండి. 

Latest Videos


అండర్ వేర్

- లోదుస్తులను వాష్ చేయడానికి ముందు వాటి లేబుల్ ను బాగా చదవండి.  చల్లటి నీటితో లేదా గోరువెచ్చని నీటితో కడగాలి అని ఎన్నో సూచనలు ఈ లేబుల్ పై ఖచ్చితంగా ఉంటాయి. 

- కాటన్ అండర్ వేర్ లను బ్లీచ్ తో కూడా క్లీన్ చేయొచ్చు. 

- ఒకవేళ మీరు వీటిని సబ్బుతో వాష్ చేయాలనుకుంటే రెండు లేదా మూడు సార్లు నీటితో అండర్ వేర్ లను బాగా కడగాలి.  ఎందుంకటే అండర్ వేర్ లపై సబ్బు ఉంటే దురద వస్తుంది.
 

అండర్ వేర్

- రంగురంగుల లోదుస్తులను ఎప్పుడూ కూడా గోరువెచ్చని లేదా వేడినీళ్లతో కడగాలి.

- ప్యాంటీలను చాలా మంది నీడలోనే ఆరబెడుతుంటారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. అండర్ వేర్ లను ఎప్పుడూ కూడా ఎండలోనే ఆరేయాలి. 
 

అండర్ వేర్

లోదుస్తుల షాపింగ్ కు సంబంధించిన ముఖ్యమైన చిట్కాలు

రెగ్యులర్ గా వేసుకోవడానికి కాటన్ లోదుస్తులను ఉత్తమమైనవి. కాటన్ లేదా నేచురల్ ఫ్యాబ్రిక్స్ ఒక్క వేసవిలోనే కాదు ప్రతి సీజన్ లోనూ ఉపయోగించొచ్చు. ఇవి చాలా కంఫర్ట్ గా ఉంటాయి. కాటన్ లోదుస్తులను  ధరించడం వల్ల చర్మంలో తేమ ఉంటుంది. అలాగే ఇది ఇతర బట్టల కంటే చెమట లేదా ఉత్సర్గను బాగా గ్రహిస్తుంది కూడా. అందుకే వీటిని ఉపయోగించండి. 

click me!