పీరియడ్స్ రక్తం గడ్డలెందుకు కడుతుంది?

First Published May 14, 2024, 10:20 AM IST

చాలా మందికి ఈ సమస్య ఎదురవుతుంది. కొన్ని కొన్ని సార్లు పీరియడ్స్ బ్లడ్ గడ్డలుగా పడుతుంటుంది. అసలు ఎందుకిలా అవుతుందని చాలా మందికి డౌట్ వస్తుంటుంది. కానీ దీని గురించి పెద్దగా పట్టించుకోరు. అసలు పీరియడ్స్ బ్లడ్ గడ్డలుగా ఎందుకు పడుతుంతో తెలుసా?

ప్రతి మహిళకు పీరియడ్స్ భిన్నంగా ఉంటాయి. కొంతమందికి పీరియడ్స్ తేలికపాటి నొప్పితో ప్రారంభమవుతుంది. మరికొంతమందికి మొదటి రోజునే హెవీగా బ్లీడింగ్ అవుతుంది. భరించలేనంతగా కడుపు నొప్పి వస్తుంది. ఇదేవిధంగా కొంతమంది ఆడవారికి పీరియడ్స్ సమయంలో రక్తం గడ్డకట్టడం జరుగుతుంది. ఇలా ఎందుకు జరుగుతుందనేది ప్రశ్న చాలా మందికి వస్తుంది. మరి కానీ దీనికి ఆన్సర్ మాత్రం ఎవ్వరికీ తెలియదు. అసలు ఇలా బ్లడ్ గడ్డలు ఎందుకు కడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

రక్తం గడ్డకట్టడం సాధారణమేనా?

పీరియడ్స్ సమయంలో పేరుకుపోయిన రక్తం జెల్లీలా బయటకు వస్తుంది. అయితే దీని పరిమాణం చిన్నదైతే మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, కానీ ఇది పదేపదే రక్తం గడ్డలుగా వస్తే మాత్రం మీరు భయపడాల్సిందే. ఇలాంటప్పుడు మీరు ఖచ్చితంగా హాస్పటల్ కు వెళ్లాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 

Latest Videos


ప్రోటీన్ కారణంగా.. 

మీ శరీరం మీ రక్తాన్ని చిక్కగా చేసే ప్రోటీన్లను విడుదల చేసినప్పుడు కూడా రక్తం గడ్డలుగా బయటకు వస్తుంది. అలాగే గర్భాశయ పొరలోని రక్త నాళాలు ఎక్కువగా రక్తస్రావం కాకుండా నిరోధించినప్పుడు కూడా పీరియడ్ రక్తం గడ్డలు బయటకు వస్తుంది. 
 

Image: Getty


గర్భాశయంలో గడ్డలు

గర్భాశయంలో గడ్డ కారణంగా కూడా మహిళలు పీరియడ్స్ సమయంలో రక్తం గడ్డకట్టొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శరీరంలో హార్మోన్ల మార్పుల వల్ల కూడా ఇది సంభవిస్తుందంటున్నారు నిపుణులు. 

రుతువిరతి సమస్యలు

మెనోపాజ్ సమస్యతో సతమతమవుతున్న మహిళలకు కూడా పీరియడ్స్ సమయంలో రక్తం గడ్డకట్టే సమస్యను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇలాంటి వారు తప్పకుండా హాస్పటల్ కు వెళ్లాలి. 
 

Image: Getty

గర్భాశయంలో క్యాన్సర్ సంకేతాలు

గర్భాశయంలో క్యాన్సర్ కూడా పీరియడ్స్ సమయంలో రక్తం గడ్డకట్టడానికి కారణమవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్యను తేలిగ్గా తీసుకోవడానికి లేదు. ఇది ప్రమాదకరమైన సంకేతమంటున్నారు నిపుణులు. 

హార్మోన్ల మార్పులు

శరీరంలో ప్రొజెస్టెరాన్, ఈస్ట్రోజెన్ హార్మోన్ల స్థాయిలు పడిపోవడం వల్ల కూడా  కొంతమంది మహిళలకు పీరియడ్స్ సమయంలో రక్తం గడ్డకడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 

గర్భస్రావం 

గర్భిణిలకు రక్తం గడ్డకట్టడం మంచిది కాదు. ఎందుకంటే ఇది గర్భస్రావానికి సంకేతం కావొచ్చంటున్నారు నిపుణులు. ఈ పరిస్థితిలో మీరు వెంటనే హాస్పటల్ కు వెళ్లాలి. 

click me!