గ్యాస్ స్టవ్ ను ఎలా క్లీన్ చేయాలి?

First Published Jun 4, 2024, 3:26 PM IST

గ్యాస్ స్టవ్ ను రోజు లేదా రెండు రోజులకోసారైనా క్లీన్ చేయకపోతే మురికిగా మారుతుంది. నూనె, ఆహార పదార్థాలతో స్టవ్ పై మురికి పేరుకుపోతుంది. అయితే చాలా రోజుల వరకు క్లీన్ చేయకుండా ఉంచడం వల్ల స్టవ్ ను క్లీన్ చేయడం పెద్ద తలనొప్పిగా మారుతుంది. కానీ కొన్ని సింపుల్ ట్రిక్స్ తో మీరు గ్యాస్ స్టవ్ ను ఈజీగా క్లీన్ చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.. .
 

వంటగదిలోని ప్రతి మూలను ఖచ్చితంగా శుభ్రం చేయాలి. వంటగది శుభ్రంగా లేకపోతే ఇళ్లంతా మురికిగా కనిపిస్తుంది. ఇలా ఉండటం ఎవ్వరికీ నచ్చదు. అయితే క్లీనింగ్ చేసేటప్పుడు గ్యాస్ స్టవ్ ను శుభ్రం చేయడం చాలా మంది మర్చిపోతుంటారు. కానీ క్లీన్ చేయకపోతే గ్యాస్ స్టవ్ పై నూనె బాగా పేరుకుపోతుంది. దీన్ని క్లీన్ చేయడం ఆడవాళ్లకు పెద్ద సవాలుగానే ఉంటుంది. కానీ కొన్ని సింపుల్ టిప్స్ తో గ్యాస్ స్టవ్ ను ఈజీగా క్లీన్ చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.


ఇటుకతో శుభ్రం 

ఇటుకను పగులకొట్టి దీని పొడిని క్లీన్ చేయడానికి ఉపయోగించొచ్చ. నిజానికి ఇది స్క్రబ్ లా పనిచేస్తుంది. గ్రామాల్లో చాలా మంది పాత్రలను క్లీన్ చేయడానికి దీన్నే ఉపయోగిస్తారు. ఇది ఎఫెక్టివ్ రాపిడిగా పనిచేస్తుంది. అలాగే మొండి మరకలతో ఈజీగా తొలగిస్తుంది. 

Latest Videos


కావాల్సిన పదార్థాలు

2 టేబుల్ స్పూన్ల ప్యూమిస్ ఇటుక ముక్కలు
డిష్ సబ్బు
స్క్రబ్బర్
శుభ్రమైన గుడ్డ

ఏం చేయాలంటే?

ముందుగా మీ గ్యాస్ స్టవ్ నాబ్స్, బర్నర్లను వేరుచేయండి. అయితే బర్నర్ లను క్లీన్ చేయకూడదు. ఎందుకంటే బర్నర్ రంధ్రాలు మూసుకుపోయే అవకాశం ఉంది. ప్యూమిస్ బ్రిక్ క్రంబ్, లిక్విడ్ డిష్ సబ్బును ఒక గిన్నెలో వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని గ్యాస్ స్టవ్ మీద అప్లై చేసి 10 నిముషాలు అలాగే ఉంచాలి.  ఆ తర్వాత  స్క్రబ్ ను నీటితో తడిపి గ్యాస్ స్టవ్ ను బాగా రుద్ది క్లీన్ చేయాలి. గ్యాస్ స్టవ్ ను నీటితో కడిగిన తర్వాత శుభ్రమైన గుడ్డతో తుడిచి ఆరబెట్టి వాడాలి. బర్నర్ ను లిక్విడ్ సబ్బుతో మాత్రమే శుభ్రం చేయాలి. ఈ విధంగా క్లీన్ చేస్తే మీ గ్యాస్ స్టవ్ మునుపటిలా జిడ్డుగా, మురికిగా కనిపించదు.
 

ఇటుక, బూడిదతో శుభ్రం 

మిగిలిపోయిన చెక్క బూడిదను పాత్రలను శుభ్రం చేయడానికి చాలా మంది ఉపయోగిస్తుంటారు. ఇది పాత్రలకు గీట్లు పడకుండా బాగా శుభ్రపరుస్తుంది. అలాగే జిడ్డును తొలగిస్తుంది. ఇటుక, బూడిద ప్రభావవంతమైన క్లీనర్లుగా పనిచేస్తాయి. ఇవి కఠినమైన రసాయనం కంటే మెరుగ్గా పనిచేస్తాయి.
 

కావాల్సిన పదార్థాలు

1 టేబుల్ స్పూన్ ప్యూమిస్ ఇటుక ముక్క
2 టేబుల్ స్పూన్ల బూడిద
డిష్ సబ్బు
స్క్రబ్బర్
శుభ్రమైన గుడ్డ

ఏం చేయాలంటే? 

స్టవ్ నుంచి బర్నర్ లను వేరుచేయండి. దీని తరువాత శుభ్రపరిచే మిశ్రమాన్ని ఒక గిన్నెలో సిద్ధం చేయండి. ఇందుకోసం బూడిద, ఇటుక పొడిని బాగా కలపండి. అందులో కొద్దిగా నీళ్లు పోసి పేస్ట్ లా తయారుచేసుకోండి. ఆ తర్వాత గ్యాస్ స్టవ్ లో గ్యాస్ స్క్రబ్బర్ ను ముంచి శుభ్రం చేయండి. బూడిదతో శుభ్రం చేసిన తర్వాత గ్యాస్ స్టవ్ కడగండి. తర్వాత లిక్విడ్ సబ్బుతో ఒకసారి శుభ్రం చేసి స్టవ్ ను క్లీన్ చేయండి. స్టవ్ ఆరిన తర్వాత శుభ్రమైన గుడ్డతో తుడవండి. ఇది నుంచి స్టవ్ పై పడిన మరకలను తొలగిస్తుంది. 
 

click me!