మీరు కొన్నది నిజమైన వెండి యేనా..? కల్తీ జరిగిందా? ఇలా చెక్ చేయండి..

First Published | Apr 22, 2024, 2:42 PM IST

నిజంగా మనం కొన్నది ప్యూర్ సిల్వర్ ఆభరణాలేనా..? వాటిలో ఏదైనా కల్తీ జరిగిందా..? ఈ విషయాలు మనకు వాటిని చూసినప్పుడు తెలీదు. మనం తిరిగి మార్చడానికి ప్రయత్నించినప్పుడు తప్పితే... నిజాలు భయటపడవు

Silver Anklets

మన ఇంట్లో మహిళలు దాదాపు అందరూ కాళ్లకు పట్టీలు పెట్టుకుంటూ ఉంటారు. ఇక పెళ్లైన వారు పట్టీలతోపాాటు.. కాలి వేళ్లకు మెట్టెలు కూడా పెట్టుకుంటూ ఉంటారు.  ప్రస్తుతం మార్కెట్లో ఆడవారిని మనసు దోచే చాలా రకాల మోడల్స్ అడుగుపెడుతున్నాయి.  వాటిని చూసి మనసు పారేసుకొని కేనేస్తూ ఉంటాం. అమ్మేవారు సైతం 92.5 ప్యూర్ సిల్వర్ అని నమ్మిస్తూ ఉంటారు.

కానీ.. నిజంగా మనం కొన్నది ప్యూర్ సిల్వర్ ఆభరణాలేనా..? వాటిలో ఏదైనా కల్తీ జరిగిందా..? ఈ విషయాలు మనకు వాటిని చూసినప్పుడు తెలీదు. మనం తిరిగి మార్చడానికి ప్రయత్నించినప్పుడు తప్పితే... నిజాలు భయటపడవు.  అయితే.. మనం కొన్ని ట్రిక్స్ తో.. అవి నిజమైనవో లేక కల్తీవో తెలుసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు  చూద్దాం..

Latest Videos


వెండి పట్టీలు నకిలీ అయితే, అది త్వరగా నల్లగా మారుతాయి. అందువల్ల, మీరు అయస్కాంతాన్ని ఉపయోగించి ఇది నిజమో కాదో కనుగొనవచ్చు. వెండి అయస్కాంతానికి అంటుకోకుండా కొద్దిగా దూరంగా అయస్కాంతాన్ని ఉంచాలి. 

దీని కోసం, ముందుగా పట్టీలు, మెట్టలను  ఒకే చోట ఉంచండి.
దీని తరువాత, ఆభరణాలపై అయస్కాంతాన్ని తిప్పండి.
అయస్కాంతాన్ని తిప్పినప్పుడు వెండి కొంచెం కూడా కదిలితే, వెండి స్వచ్ఛమైనది కాదని అర్థం చేసుకోండి. దాంట్లో ఐరన్ ఏమీ కలవలేదని అర్థం. అలా కాకుండా... కొంచెం కదిలినా.. అవి నకిలీ అని తెలుసుకోవాలి.
 


వెండి ఆభరణాల స్వచ్ఛతను తనిఖీ చేయడానికి, ముందుగా మీ వెండి కాలి మెట్టలను లేదంటే.. పట్టీలను  పళ్లతో లేదా మరేదైనా తేలికగా నొక్కండి. వెండి, బంగారం వంటి ఆభరణాలు పెళుసుగా ఉండడమే ఇందుకు కారణం. వెండిపై పళ్ల చిన్న గుర్తు కూడా పడితే ఆ నగలు అసలైనవే అని అర్థమవుతుంది. దాంట్లో నకిలీ ఉంటే.. అలా పంటి గాట్లు పడవు.
 

click me!