ఈ హోయిర్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.. కోడిగుడ్డు, తేనె, అరటిపండు, మూడు స్పూన్ల తేనె, మూడు స్పూన్ల పాలు, ఐదు టేబుల్ స్పూన్ల ఆలివ్ నూనె... అన్నింటినీ బాగా కలపాలి. ఆ తర్వాత ఆ ప్యాక్ ని జట్టు కుదుళ్ల నుంచి చివరి వరకు బాగా పట్టించాలి. గంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసి... గాఢత తక్కువ ఉన్న షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే.... జుట్టు అందంగా, ఆరోగ్యంగా పెరుగుతుంది.